ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశాలకు వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సాహితి లక్ష్మీనారాయణ కుమారుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు

ABN, First Publish Date - 2023-03-07T12:28:00+05:30

సాహితి లక్ష్మీనారాయణ కుమారుడు సాత్విక్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాలకు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సాహితీ సాత్విక్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

Hyderabad : సాహితి లక్ష్మీనారాయణ (Sahithi Lakshminarayana Son) కుమారుడు సాత్విక్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాలకు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport)కు చేరుకున్న సాహితీ సాత్విక్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాత్విక్ పై ఇప్పటికే సీసీఎస్ పోలీసులు (CCS Police) లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన సాత్విక్‌ని పోలీసులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. సాహితీ స్కాంలో సాత్విక్ A2గా ఉన్నాడు.

సాహితీ ఇన్ ఫ్రా.. ప్రీ లాంచ్ ఆఫర్ పేరిట ప్లాట్లు ఇస్తామని భారీ మొత్తంలో డబ్బు సేకరించి కస్టమర్లను నిండా ముంచేసింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పటికే సాహితీ ఇన్ ఫ్రా టెక్ వెంచర్స్ ఎండీ, టీటీడీ బోర్డు సభ్యుడు లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గతంలోనే ఆయనపై కేసులు నమోదు చేసినట్లు గుర్తించారు. 1500 మందికి పైగా వినియోగదారుల నుంచి రూ.539 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులోనే ఏ2 నిందితుడిగా సాత్విక్ ఉన్నారు.

Updated Date - 2023-03-07T12:28:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising