TS News: షర్మిల దాడి ఘటనపై పోలీసులు సీరియస్
ABN, First Publish Date - 2023-04-24T14:27:25+05:30
హైదరాబాద్: షర్మిల (Sharmila) దాడి ఘటనపై పోలీసులు సీరియస్ (Police Serious) అయ్యారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వైఎస్ షర్మిలపై కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: షర్మిల (Sharmila) దాడి ఘటనపై పోలీసులు సీరియస్ (Police Serious) అయ్యారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వైఎస్ షర్మిలపై కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న ఎస్ఐ (SI), కానిస్టేబుల్ (Conistable)పై షర్మిల చేయిచేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఐపీసీ 332, 353 సెక్షన్ల కింద షర్మిలపై కేసు నమోదు చేశారు. షర్మిలను పోలీసులు అరెస్టు (Arrest) చేసి బంజారాహిల్స్ పీఎస్‌లో ఉంచారు. షర్మిల ఏ పార్టీ కార్యక్రమం నిర్వహించినా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం, ఒకవేళ కోర్టు నుంచి ఆమె అనుమతి తెచ్చుకున్నా.. నిరాకరిస్తున్నారు. వరుసగా లోటస్ పాండ్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage) విషయంలో సిట్ (SIT) అధికారులు దర్యాప్తు వేగవంతం చేయడంలేదని, దీనికి సంబంధించి సిట్ అధికారులను కలిసి మెమొరాండం ఇచ్చేందుకు వైఎస్సార్ టీపీ భావించింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం లోటస్ పాండ్‌లో తన నివాసం నుంచి షర్మిల బయలుదేరుతున్న నేపథ్యంలో పోలీసులు ఆమెను అడ్డుకుని.. అనుమతి లేదని చెప్పారు. ఈ క్రమంలో షర్మిలకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ ఎస్ఐ, మహిళ కానిస్టేబుల్‌పై షర్మిలా చేయిసుకున్నారంటూ పోలీసులు ఆమెను అరెస్టు చేసి పీఎస్‌కు తీసుకువచ్చారు. రెండు సెక్షన్లకింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో షర్మిల తల్లి విజయలక్ష్మి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కుమార్తెను పరామర్శించే ప్రయత్నం చేశారు. అయితే అందుకు పోలీసులు నిరాకరించారు. ఈ సందర్భంగా పోలీసులు, ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు షర్మిల భర్త అనిల్.. లీగల్ టీమ్‌ను తీసుకుని షర్మిల బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లారు.
Updated Date - 2023-04-24T14:27:25+05:30 IST