Vijayashanti: అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రీతి మృతి
ABN, First Publish Date - 2023-02-27T00:32:37+05:30
ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న వరంగల్ కేఎంసీ మెడికో డాక్టర్ ప్రీతి(Preeti's death) ఇక లేరని తెలిసి ఎంతో ఆవేదన కలుగుతోందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి ( Vijayashanti) అన్నారు.
హైదరాబాద్: ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న వరంగల్ కేఎంసీ మెడికో డాక్టర్ ప్రీతి(Preeti's death) ఇక లేరని తెలిసి ఎంతో ఆవేదన కలుగుతోందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి ( Vijayashanti) అన్నారు. ప్రీతి మృతిపై విజయశాంతి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌ను యథప్రకారం ప్రచురిస్తున్నాం. ‘‘రాష్ట్ర ప్రభుత్వపరంగా ఎన్నో వ్యవస్థలు, యంత్రాంగం ఉన్నప్పటికీ అవేవీ బాధ్యతాయుతంగా పనిచెయ్యకపోవడం... పాలకులు, అధికారుల ఉదాసీనత ఒక ఉన్నత విద్యావంతురాలిని వేధింపులకి బలి చేశాయి. డాక్టర్ ప్రీతి తండ్రి రైల్వే పోలీస్ విభాగంలో ఏఎస్ఐ స్థాయిలో ఉన్న ఉద్యోగి. వేధింపులకి సంబంధించి తగిన ఆధారాలతో ఈయన ఇచ్చిన ఫిర్యాదునే పోలీసులు పట్టించుకోలేదంటే, రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం పనితీరు ఎంత నిర్లక్ష్యంగా ఉందో చెప్పాల్సిన పని లేదు. షీ టీమ్స్ (She teams) పెట్టామని... ఇంకేమో చేశామని గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ సర్కారు(Telangana Govt)కి ఈ సంఘటన ఇదొక పెద్ద మచ్చ. ప్రీతి ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటూ ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’’ విజయశాంతి తెలిపారు.
******************************
ఇవి కూడా చదవండి..
******************************
Doctor Preethi died: మృత్యువుతో పోరాడి ఓడిన ప్రీతి.. కన్నీరు మున్నీరవుతున్న ఫ్యామిలీ, ఫ్రెండ్స్
******************************
Warangal Preethi Case: గాంధీ ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు.. ఏం జరుగుతోందో తెలియక ఆందోళనలో ప్రీతి కుటుంబ సభ్యులు..!
******************************
Warangal KMC: సీనియర్ల వేధింపులు.. విషపు ఇంజక్షన్ తీసుకున్న కేఎంసీ మెడికో
******************************
Updated Date - 2023-02-27T00:42:46+05:30 IST