Rajnath Singh: ఈరోజుతో మీ శిక్షణ ముగిసింది. కానీ.. యువ పైలెట్లతో రాజ్ నాథ్ సింగ్
ABN, Publish Date - Dec 17 , 2023 | 10:37 AM
హైదరాబాద్: దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌ను ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హజరయ్యారు.
హైదరాబాద్: దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌ను ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) హజరయ్యారు. ఈ సందర్భంగా యువ పైలెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సైనికాధికారుల విన్యాసాలను వీక్షించారు. ఈ సందర్భంగా రాజ్‌నాధ్ సింగ్ మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లకు శుభాకాంక్షలు తెలిపారు.
క్యాడెట్లుగా ఉన్నప్పుడు మీరంతా విద్యార్థులుగా ఉంటారని, శిక్షణ పొందుతుంటారని, కానీ.. నేటితో మీరు ఆఫీసర్లుగా మారబోతున్నారని, మీపై భాధ్యత మరింత పెరుగుతుందని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. శిక్షణలో ఉన్నన్ని రోజులు.. మీరు మీ తల్లిదండ్రులకు, కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉంటారన్నారు. ఈరోజుతో మీ శిక్షణ ముగిసిందని, కానీ.. మున్ముందు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. దేశ గౌరవం, దేశ భద్రత మీపై ఉంటుందని, సరికొత్త ఇన్నోవేషన్‌లు వస్తున్నాయన్నారు. టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ అవ్వాలని సూచించారు. ట్రెడిషన్, ఇన్నోవేషన్.. రెండింటినీ కలుపుకునిపోతూ భాధ్యతగా నిర్వర్తించాలని, సంప్రదాయాలను పాటిస్తూ.. గౌరవించాలని రాజ్‌నాథ్ సింగ్ యువ పైలెట్లకు సూచనలు చేశారు. కాగా ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన 212 మంది యువ పైలైట్లు పాల్గొన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 10:37 AM