ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Apsara Case: అప్సర హత్య కేసులో సాయికృష్ణకు 14 రోజుల రిమాండ్

ABN, First Publish Date - 2023-06-10T10:04:19+05:30

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో ప్రధాన నిందితుడు పూజారి వెంకట సాయి సూర్య కృష్ణను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో ప్రధాన నిందితుడు పూజారి వెంకట సాయి సూర్య కృష్ణను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈరోజు ఉదయం నిందితుడిని జడ్జి ఇంటి ముందు శంషాబాద్ ఆర్జీఐ పోలీసులు హాజరుపరిచారు. సాయికృష్ణకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈక్రమంలో నిందితుడిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

కాగా.. అప్సరను సాయికృష్ణ హత్య చేసి మృతదేహాన్ని మ్యాన్‌హోల్‌లో పడేయడంతో కలకలం రేపింది. సరూర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన సాయికృష్ణకు అప్సర అనే మహిళతో పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. గుడికి వెళ్లి వెస్తున్న సమయంలో ఇరువురి మధ్య పరిచయం ఏర్పాడింది. అయితే సాయికృష్ణకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని సాయిపై అప్సర ఒత్తిడి తెస్తూ వచ్చింది. దీంతో కోప్రోదిక్తుడైన సాయి.. బయటికెళ్దామని చెప్పి ఇద్దరూ కారులో శంషాబాద్‌లోని సుల్తాన్‌పల్లికి వెళ్లారు. కోయంబత్తూరు వెళ్తున్నట్లు చెప్పి అప్సర.. సాయికృష్ణ దగ్గరికెళ్లింది. అక్కడికి వెళ్లాక కూడా పెళ్లి ప్రస్తావన రావడంతో ఆగ్రహంతో రగిలిపోయిన సాయికృష్ణ.. అప్సర తలపై బండరాయితో హత్యచేసి మళ్లీ అదే కారులో తీసుకొచ్చి స్థానికంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద మ్యాన్‌హోల్‌లో పడేశాడు. అనంతరం తనకేమీ తెలియదన్నట్లుగా తన సమీప బంధువు అప్సర కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సాయి సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేయగా.. సాయికృష్ణే నిందితుడని పోలీసులు తేల్చారు. నిందితుడిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఆపై మ్యాన్‌హోల్‌‌లో ఉన్న మృతదేహాన్ని గుర్తించి వెలికితీసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

అయితే అప్సర గర్భం దాల్చిందని.. అందుకు తానే కారణమని చెప్పడంతోనే హత్య చేసినట్లు నిందితుడు సాయికృష్ణ చెప్పుకొచ్చాడు. అప్సర వేరేవాళ్లతో సన్నిహితంగా ఉండేదన్నారు. మరోవైపు ఈరోజు అప్సర మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఈ పోస్టుమార్టం కీలకం కానుంది. అప్సర గర్భంపై ఇద్దరి మధ్య గొడవ మొదలైందని.. మొదటిసారి అప్సర గర్భవతి అయినప్పుడు సాయికృష్ణ అబార్షన్ చేయించాడు. అయితే రెండోసారి కూడా అప్సర గర్భం దాల్చింది. గర్భం పైనే వివాదం జరిగినట్లు పోలీసులు అనుమనిస్తున్నారు. అప్సర పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2023-06-10T10:04:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising