ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Naveen Case : ఒకరికి తెలియకుండా మరొకరితో యువతి ప్రేమాయణం.. యువతి సెల్‌ఫోన్‌లో షాకింగ్ విషయాలు..

ABN, First Publish Date - 2023-03-01T09:15:08+05:30

నవీన్ హత్య కేసులో కీలక పురోగతిని పోలీసులు సాధించారు. హరిహరకృష్ణ, నవీన్ ఇద్దరూ స్నేహితులు. అయితే ఇద్దరు స్నేహితులతో ఒకరికి తెలియకుండా మరొకరితో యువతి ప్రేమాయణం నడిపినట్టు పోలీసులు గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్ : నవీన్ హత్య కేసులో కీలక పురోగతిని పోలీసులు సాధించారు. హరిహరకృష్ణ, నవీన్ ఇద్దరూ స్నేహితులు. అయితే ఇద్దరు స్నేహితులతో ఒకరికి తెలియకుండా మరొకరితో యువతి ప్రేమాయణం నడిపినట్టు పోలీసులు గుర్తించారు. యువతి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. తొలుత నవీన్‌తో ప్రేమాయణం నడిపిన యువతి.. ఆ విషయాన్ని హరికృష్ణ వద్ద దాచి అతనితో ప్రేమాయణం నడిపింది. కొన్నాళ్ల తర్వాత నవీన్‌ను పక్కనబెట్టి హరికృష్ణకు దగ్గరైంది.

అయితే ఈ విషయం నవీన్‌కు తెలియక పోవడంతో పదే పదే కాల్స్ చేయడం.. మెసేజ్‌లు పంపడం వంటివి చేసేవాడు. కాగా.. హరికృష్ణతో యువతి ఉన్న సమయంలో నవీన్ నుంచి పదే పదే మెసేజ్‌లు రావడంతో అతనిలో అనుమానం రేకెత్తింది. నవీన్ బతికి ఉంటే ఎప్పటికైనా ఇబ్బందేనని, ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుందనే అక్కసుతోనే హత్యకు హరికృష్ణ స్కెచ్ గీశాడు. అబ్దుల్లాపూర్‌మెట్ పూర్తిగా తెలిసిన ప్రాంతం కావడంతో నవీన్‌ను హత్య చేసేందుకు అదే సరైన ప్లేస్ అని హరకృష్ణ భావించాడు.

హత్య అనంతరం నవీన్ శరీర భాగాలను వేరు చేసే వీడియో, ఫొటోలను యువతికి నవీన్ పంపించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ భయానక దృశ్యాలను చూసిన యువతి అస్వస్థతతకు గురైనట్లు సమాచారం. ఆ వివరాలను తల్లిదండ్రులతో కూడా పంచుకున్నట్లు తెలిసింది. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ హత్య కేసులో యువతి పాత్రపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2023-03-01T09:56:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!