TS HighCourt: సింగరేణి ఎన్నికలపై హైకోర్టులో విచారణ వాయిదా
ABN, Publish Date - Dec 18 , 2023 | 11:22 AM
Telangana: సింగరేణి ఎన్నికలపై విచారణను హైకోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది. సింగరేణి ఎన్నికలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.
హైదరాబాద్: సింగరేణి ఎన్నికలపై విచారణను హైకోర్టు (Telangana High Court) ఈనెల 21కి వాయిదా వేసింది. సింగరేణి ఎన్నికలపై (Singareni Elections) సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇంధన శాఖ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికలను డిసెంబర్ 27కు బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని పిటిషన్ దాఖలైంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నిక నిర్వహణకు సమయం కావాలని యూనియన్ తరపున సినియర్ కౌన్సిల్ కోర్టును కోరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సింగరేణి ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో చెప్పారు కదా అన్న విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది. అయితే సింగరేణి ఎన్నికలు నిర్వహించేందుకు సమయం కావాలని యూనియన్ కోరడంతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా వేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 18 , 2023 | 11:58 AM