ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth Reddy: సిట్ నోటీసులు ఇంకా అందలేదు...

ABN, First Publish Date - 2023-03-20T15:15:05+05:30

సిట్ నోటీసులు తనకు ఇంకా అందలేదని, ఆ నోటీసులకు భయపడేది లేదని టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజ్ కేసు (Paper Leakage Case)లో సిట్ అధికారులు (SIT Officials) దూకుడు పెంచారు. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై విమర్ళలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి నోటీసులు ఇచ్చారు. దీనిపై స్పందించిన రేవంత్ మీడియాతో మాట్లాడుతూ సిట్ నోటీసులు తనకు ఇంకా అందలేదని అన్నారు. ఆ నోటీసులకు భయపడేది లేదని, తన దగ్గర ఉన్న ఆదారాలను సిట్‌ (SIT)కు ఇవ్వనని.. సిట్టింగ్ జడ్జి (Sitting Judge)తో విచారణ చేపించాలని.. అప్పుడే ఆధారాలు ఇస్తానని రేవంత్ స్పష్టం చేశారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు అండగా ఉంటామన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ భాగోతం బయటపడాలంటే సిట్టింగ్ జడ్జ్‌తోనే విచారణ జరిపించాలన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గద్దె దిగేవరకు తమ పోరాటం కొనసాగుతుందని, ఈ కేసును కావాలనే నీరుగారుస్తున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు.

కాగా టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై విమర్ళలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. పేపర్ లీక్ కేసులో ఆధారాలు ఇవ్వాలని కోరారు. ఇటీవలే మంత్రి కేటీఆర్ (Minister KTR) పీఏ తిరుపతి (PA Tirupathi) పాత్ర ఉందని రేవంత్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలు అందచేయాలంటూ రేవంత్ రెడ్డికి అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఓకే మండలంలో వందమందికి ర్యాంకులు వచ్చాయంటూ రేవంత్ రెడ్డి ఆరోపణ చేశారు. దీంతో రేవంత్ వద్ద ఉన్న వివరాలతో సహా ఆధారాలు అందజేయాలని సిట్ ఏసీపీ నోటీసులు జారీ చేశారు. ఇంకా కొంతమందికి నోటీసులు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay)కు కూడా నోటిసులు ఇచ్చి, వివరాలు తీసుకుంటామని సిట్ అధికారులు అన్నారు.

Updated Date - 2023-03-20T15:15:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising