ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Srikantachari mother: ఓ శాలువాతో తుస్‌మనిపించారు! ఇందుకోసమేనా పిలిచింది..!?

ABN, First Publish Date - 2023-06-23T14:50:37+05:30

అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి ఓ శాలువాతో తుస్‌మనిపించారు. ఇదంతా ఎవరి కోసం అనుకుంటున్నారా?. అదేనండి మలిదశ తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గురించి. రెండ్రోజుల క్రితం శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. ప్రభుత్వ పెద్దల నుంచి ఆహ్వానం వచ్చిందంటూ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ అదంతా వట్టిదేనని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి ఓ శాలువాతో తుస్‌మనిపించారు. ఇదంతా ఎవరి కోసం అనుకుంటున్నారా?. అదేనండి మలిదశ తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ (Shankaramma) గురించి. రెండ్రోజుల క్రితం శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. ప్రభుత్వ పెద్దల నుంచి ఆహ్వానం వచ్చిందంటూ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ అదంతా వట్టిదేనని గురువారం సాయంత్రం అమరవీరుల స్మారక చిహ్మం ప్రారంభోత్సవ కార్యక్రమంతో తేలిపోయింది. సభావేదికపై శంకరమ్మకు ఓ శాలువా కప్పి చేతులు దులుపుకున్నారు ప్రభుత్వ పెద్దలు. దీంతో ఆమె ఆశలన్నీ అడియాశలయ్యాయి. తాజాగా ఇదే అంశంపై శంకరమ్మ స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఆవేదన

అమరవీరుల స్మారక చిహ్మం ప్రారంభోత్సవంలో శ్రీకాంతాచారి త్యాగాన్ని స్మరించలేదని శంకరమ్మ కన్నీరు పెట్టుకున్నారు. ‘‘శ్రీకాంతాచారి పేరు ప్రస్తావించక పోవడం బాధేసింది. కనీసం దేశపతి లాంటి వారైనా శ్రీకాంతాచారి త్యాగం గుర్తు చేయాల్సింది. నా కొడుకు త్యాగం చాలా గొప్పది. శ్రీకాంతాచారి త్యాగానికి గుర్తింపు ఉండాలని కోరుకుంటున్నా. కనీసం శ్రీకాంతాచారి ఫొటో అయినా ప్రదర్శిస్తే సంతోషించేదాన్ని. అన్ని పదవులకు నాకు అర్హత ఉంది. కేసీఆర్‌ను కలిసే అవకాశం దొరకడం లేదు. కేసీఆర్‌ను కలిసే అవకాశం కల్పించాలని చాలా మంది నేతలను అడిగా. కానీ ఎవరూ తీసుకెళ్లడం లేదు. నీకు పదవి ఎందుకు రావడం లేదని చాలా మంది అడుగుతున్నారు. నాకు ఎమ్మెల్సీ ఇస్తారని నాలుగు కోట్ల మంది ప్రజలు ఎదురుచూశారు. ఇప్పటికైనా నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి. ఈ నాలుగైదు రోజుల్లో ప్రకటన చేయాలని కోరుకుంటున్నా. ఎమ్మెల్సీ ఇస్తే అటు కేసీఆర్‌కు ఇటు నాకు గౌరవంగా ఉంటుంది. నేను మరణిస్తే తప్ప నాకు కడుపు కోత తీరదు. మిగిలిన అమరవీరుల కుటుంబాలకు కూడా న్యాయం చేయాలి.’’ అని శంకరమ్మ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-06-23T14:50:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising