ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KCR: ప్రసంగం మధ్యలో లైవ్ కెమెరాను బయటకు పంపిన కేసీఆర్

ABN, First Publish Date - 2023-04-01T17:17:27+05:30

సీఎం కేసీఆర్ (CM KCR) సమక్షంలోమహారాష్ట్రకు చెందిన పలువురు రైతు సంఘం నేతలు BRSలోకి చేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: సీఎం కేసీఆర్ (CM KCR) సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు రైతు సంఘం నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఈ సమావేశానికి మీడియాను కేసీఆర్ అనుమతించలేదు. ఏస్ మీడియాతో పార్టీ లైవ్ ప్రసారాలు ఇస్తున్నాయి. ప్రత్యక్ష ప్రసారాలు మధ్యలో కేసీఆర్ ఆపేశారు. ప్రసంగం మధ్యలో లైవ్ కెమెరాను సీఎం బయటకు పంపేశారు. అలాగే మోడీపై విమర్శలు చేస్తుండగా కెమెరాను కేసీఆర్ ఆపించినట్లు తెలిసింది. ఈ ప్రవర్తన కాస్త విచిత్రంగా అనిపించిందనే టాక్ వినిపిస్తోంది.

కాగా తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో రైతుల గురించి ఏ నాయకుడు మాట్లాడలేదని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. ఢిల్లీలో రైతులు నెలల తరబడి ధర్నాలు నిరసనలు చేశారని గుర్తుచేశారు. రైతుల పోరాటం న్యాయమైందన్నారు. ఢిల్లీ లో రైతులు ధర్నా చేస్తే కలిస్తాన్ ఉగ్రవాదులు, తీవ్రవాదులు అని ముద్ర వేశారని మండిపడ్డారు. చలిలో నిద్రాహారాలు మాని నిరసన, ఉద్యమాలు చేశారని చెప్పారు. 700 మంది రైతులు చనిపోయిన తర్వాత కూడా వారి కుటుంబాలకు ప్రధాని మోడీ (PM Modi) చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరించుకున్నామన్నారు. తెలంగాణ (Telangana)లో రైతు అత్మహత్యలు లేవన్నారు. దేశంలో అన్ని ఉన్నాయి, కానీ సింగపూర్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయని, మన దేశం పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించాలన్నారు. మన దేశ పరిస్తితి చూసి సిగ్గుతో తల దించుకోవాలన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నానని చెప్పారు. ఇప్పుడున్న ప్రధాని మంత్రి 14వ ప్రధాని అని, ఆయనకు కూడా జ్ఞానం లేదన్నారు.

Updated Date - 2023-04-01T17:39:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising