ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM: ప్రధాని వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మంత్రి తీవ్ర ఆగ్రహం

ABN, First Publish Date - 2023-04-08T17:52:57+05:30

ప్రధాని మోదీ (PM Modi)పై మంత్రి గంగుల కమలాకర్‌ (Gangula Kamalakar) ఫైర్ అయ్యారు.

హైదరాబాద్: ప్రధాని మోదీ (PM Modi)పై మంత్రి గంగుల కమలాకర్‌ (Gangula Kamalakar) ఫైర్ అయ్యారు. మోదీ అబద్దాలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోలు‌పై మోదీ ఓక్క మాట మాట్లాడలేదన్నారు. కేంద్రం బియ్యం ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయడం లేదని పచ్చి అబద్ధం చెప్పారని ధ్వజమెత్తారు. గత తొమ్మిదేళ్ళలో కేంద్రం ఓక్క రేషన్ కార్డు పెంచలేదన్నారు. వడ్లు కొనకుండా నూకలు తినమని అవహేళన చేసారని ఆయన మండిపడ్డారు. ప్రధాని‌ది అదానీ కుటుంబమన్నారు.

కాగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ వేదికపై నుంచే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని అంకురార్పణ చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఏపీ-తెలంగాణను కలుపుతూ మరో వందే భారత్ ట్రైన్ ను తీసుకొచ్చాం. భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి తిరుమల వెంకన్న వరకు ట్రైన్ వేశాం అని ప్రధాని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు, నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం మరువలేనిదన్నారు.

Updated Date - 2023-04-08T17:52:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising