TS News: విషాదం... సాఫ్ట్‌వేర్ కుటుంబం ఆత్మహత్య.. పోలీసుల అనుమానం ఏంటంటే..?
ABN, First Publish Date - 2023-03-25T18:25:15+05:30
నగరంలోని కుషాయిగూడ (kushaiguda)లో విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడ (kushaiguda)లో విషాదం చోటుచేసుకుంది. కందిగూడ (Kandiguda)లో విషంతాగి సాఫ్ట్‌వేర్ కుటుంబం (software family Sucid) ఆత్మహత్యకు పాల్పడింది. దంపతులతోపాటు ఇద్దరు పిల్లలు బలవన్మరణం చేసుకున్నారు. మృతులు సతీష్(39), వేద(35), నిషికెట్(9), నిహాల్(5)గా గుర్తించారు. మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణమని పోలీసు (TS Police) లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2023-03-25T18:25:18+05:30 IST