TS News: షర్మిల సమావేశంలో తెరపైకి వచ్చే అంశాలు ఇవే
ABN, First Publish Date - 2023-04-09T17:03:48+05:30
రేపు వైఎస్ షర్మిల (YS Sharmila) అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.
హైదరాబాద్: రేపు వైఎస్ షర్మిల (YS Sharmila) అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు సోమాజిగూడ (Somagiguda) ప్రెస్‌క్లబ్ (Press Club)లో సమావేశమవుతారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీలు, ప్రజా, యువజన, విద్యార్థి సంఘాలు హాజరుకానున్నాయి. BJP,BRS యేతర పార్టీలతో T-SAVE ఫోరం బలోపేతంపై చర్చించనున్నారు. అలాగే T- SAVE ఫోరం అధ్వర్యంలో ఐక్య కార్యాచరణ రూప కల్పనపై కూడా చర్చ జరగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 1.91 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ప్రధాన డిమాండ్ చేయనున్నారు. కేంద్రం ఇస్తామని చెప్పిన 2 కోట్ల ఉద్యోగ హమిపై చర్చించనున్నారు.
Updated Date - 2023-04-09T17:03:48+05:30 IST