ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: గ్రూపు 2 అభ్యర్థులపై లాఠీచార్జ్.. టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద టెన్షన్ టెన్షన్

ABN, First Publish Date - 2023-08-10T15:45:59+05:30

గ్రూప్ 2 వాయిదా(Group 2 postponement) వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్(Police lati charge) చేశారు.

హైదరాబాద్ (నాంపల్లి)(Hyderabad Nampally): గ్రూప్ 2 వాయిదా(Group 2 postponement) వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్(Police lati charge) చేశారు. దీంతో టీఎస్సీపీస్సీ కార్యాలయం(TSPSC office) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనను అడ్డుకుంటున్న పోలీసులపై కొంతమంది అభ్యర్థులు దాడికి దిగడంతో పోలీసులు, అభ్యర్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం దిగి వచ్చే వరకు నిరసన విరమించబోమని అభ్యర్థులు చెప్పారు.

గోశామహల్ స్టేడియానికి అభ్యర్థులు..

గ్రూప్ 2 వాయిదా వేయాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం(TJS president Kodandaram)ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గ్రూప్ 2 అభ్యర్థులు(Group 2 candidates) భారీ సంఖ్యలో టీఎస్పీఎస్సీ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. టీఎస్పీఎస్సీ ముందు ఆందోళన చేస్తున్నటీజేఎస్ నేతలను, NSUI రాష్ట్ర అధ్యక్షుడు బలుమూరి వెంకట్‌(Congress leader Balumuri Venkat)ను పోలీసులు ఉదయం అదుపులోకి తీసుకుని గోషామహల్‌(Goshamahal) స్టేడియానికి తరలించారు. దాదాపు 200 మందిని అదుపులోకి తీసుకొని గోషామహల్ స్టేడియానికి తరలించారు. గోషామహల్‌ స్టేడియంలో తమను బంధించారంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అలాగే గోశామహల్ స్టేడియంలో ఉన్న అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ ముందు మరి కొంతమంది అభ్యర్థులు ఆందోళన చేపట్టారు.శాంతియుతంగా తమ నిరసన తెలియజేస్తే పోలీసులు అనైతికంగా ప్రవర్తిస్తున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 2 పరీక్షల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో టీఎస్పీఎస్సీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అభ్యర్థులు ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా టీఎస్పీఎస్సీ వద్ద పోలీసులు బారీగా మోహరించారు.


ఆందోళన విరమించాలి: డీసీపీ వెంకటేశ్వర్లు

ఆందోళన చేస్తున్న అభ్యర్థులతో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు(Central Zone DCP Venkateshwarlu) మాట్లాడారు. మరికాసేపట్లో ఆందోళన ఆపేయాలని లేకపోతే ఆందోళన చేస్తున్న వారందరినీ అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఉదయం వచ్చిన అభ్యర్థులను ముందస్తుగా అరెస్ట్ చేశామని, ఆందోళన విరమించకపోతే మిగతా వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. శాంతియుతంగా ధర్నా చేసుకుంటామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కోరితే గంట అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. అభ్యర్థులు, నేతలు మూడుగంటలుగా ఆందోళన చేస్తున్నారని.. వెంటనే నిరసనను విరమించుకోవాలని డీసీపీ వెంకటేశ్వర్లు కోరారు. 48 గంటల్లో TSPSC నుంచి అభ్యర్థులకు అనుకూలమైన ప్రకటన వస్తుందని చెప్తున్న.. రాష్ట్రప్రభుత్వం, TSPSCపై నమ్మకం అభ్యర్థులు లేదన్నారు.మంత్రి కేటీఆర్ వచ్చి భరోసా ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.గ్రూప్2 వాయిదా వేస్తున్నట్లు లిఖితపూర్వక ప్రకటన ఇస్తే తప్పా ఇక్కడి నుంచి కదలమని అభ్యర్థులు ఖరాఖండిగా పోలీసులకు చెప్పారు. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ కార్యాలయాకి భారీ సంఖ్యలో చేరుకుని ఆందోళన చేపట్టారు. ఆందోళనలు ఉధృతం కావడంతో పోలీసులు అభ్యర్థులను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

టీఎస్ హైకోర్టులో పిటీషన్..

గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈనెల 29, 30వ తేదీల్లో తలపెట్టిన గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టులో150 మంది గ్రూప్ 2 అభ్యర్థులు హైకోర్టులో పిటీషన్ వేశారు. గురుకుల, ఇతర నియామక పరీక్షలు ఉన్నందున గ్రూప్2 పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని అభ్యర్థులు హైకోర్టు‌ని పిటిషన్‌లో కోరారు.

Updated Date - 2023-08-10T17:05:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising