ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Assembly: నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు

ABN, First Publish Date - 2023-08-06T08:39:23+05:30

హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఆదివారంతో ముగియనున్నాయి. దీంతో ఈ రోజు శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. తొమ్మిదేళ్ళ తెలంగాణ సాధించిన ప్రగతిపై లఘు చర్చ జరగనుంది.

హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Meetings) ఆదివారంతో ముగియనున్నాయి. దీంతో ఈ రోజు శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. తొమ్మిదేళ్ళ తెలంగాణ సాధించిన ప్రగతిపై లఘు చర్చ జరగనుంది. స్వల్పకాలిక చర్చలో సీఎం కేసీఆర్ (CM KCR) మాట్లాడనున్నారు. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (Congress MLAs) స్పీకర్‌ను కలిసి నిరసన తెలుపనున్నారు. సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల్లో సమావేశాలు ముగించడం పట్ల కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఆర్టీసీ (RTC) విలీనం బిల్లు లేకుండానే శాసన సభ సమావేశాలు ముగుస్తున్నాయి. డ్రాఫ్ట్ బిల్లుపై గవర్నర్‌కు ప్రభుత్వానికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. మరో మూడు అంశాలపై గవర్నర్ తమిళిసై (Governor Tamilisai వివరణ కోరారు. వాటికి ఇంకా ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. ప్రభుత్వం వివరణ ఇస్తే ఈ రోజు ఆర్టీసీ విలీన బిల్లు అసెంబ్లీలో పెట్టేందుకు గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

Updated Date - 2023-08-06T08:39:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising