Kokapet Lands: తెలంగాణ సర్కార్‌కు కాసులు కురిపించిన కోకాపేట భూముల వేలం
ABN, First Publish Date - 2023-08-03T16:39:56+05:30
కోకాపేట నియో పాలిస్ రెండో విడత భూముల వేలం తెలంగాణ సర్కార్‌కు కాసుల పంట పండిస్తోంది. గురువారం కోకాపేటలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో కోకాపేట్ భూముల వేలం కొనసాగుతోంది.
హైదరాబాద్: కోకాపేట నియో పోలిస్ రెండో విడత భూముల వేలం తెలంగాణ సర్కార్‌కు కాసుల పంట పండించింది. గురువారం కోకాపేటలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో కోకాపేట భూముల వేలం కొనసాగుతోంది. 6, 7, 8, 9 ప్లాట్లకు సంబంధిం వేలం జరుగుతోంది. 45.33 ఎకరాల్లోని ఏడు ప్లాట్లను హెచ్‌ఎండీ వేలం వేస్తోంది. ప్లాటు కనీస విస్తీర్ణం 3.9 ఎకరాల నుంచి 9.1 ఎకరాలుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీ నిర్వహించిన ఈ వేలంలో ఆన్‌లైన్‌లో కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. ఒక ఎకరానికి అప్సెట్ ధర రూ.35 కోట్లుగా అధికారులు నిర్ణయించారు.
గతంలో కోకాపేటలో 49 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రెండువేల కోట్ల ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు కనిష్టంగా ఎకరా రూ.31 కోట్ల నుంచి అత్యధికంగా రూ.60 కోట్ల రూపాయల ధర పలికింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువే పలికి ఏకంగా ఎకరం ధర రూ.70 కోట్ల వరకూ వేలంలో దూసుకెళ్లడంతో తెలంగాణ ప్రభుత్వం భారీ ఆదాయాన్ని మరోసారి ఆర్జించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రెండువేల నుండి రూ.2500 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరుతుందని హెచ్ఎండిఏ ఆశిస్తోంది. కోకాపెట నియో పోలిస్ భూములల్లో మల్టీపర్పస్ నిర్మాణాలు చేసుకోవడానికి అవకాశం ఉండడంతో భారీగా డిమాండ్ పెరిగింది. ఆఫీస్, రెసిడెన్షియల్ స్పేస్‌కు ఉపయోగించుకునే అవకాశం ఉంది. భారీ నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వనుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎయిర్పోర్ట్‌కు, సిటీకి అత్యంత దగ్గరలో ఉన్న భారీ లేఅవుట్ కోకాపేట నియో పోలిస్ లేఅవుట్.. దీంతో డిమాండ్ భారీగా పెరిగింది.
కో అంటే.. కోట్లు..!
రికార్డ్ స్థాయిలో HMDA నియో పాలిస్ భూముల వేలం
రూ.1532.5 కోట్లు పలికిన 6, 7, 8, 9 ప్లాట్లు
అత్యధికంగా ఎకరం 72 కోట్లు పలికిన ధర
రూ.51.75 కోట్లు అత్యల్పంగా పలికిన ఎకరం భూముల ధర.
7 ఎకరాల ప్లాట్‌కు ఎకరాకు 57.25 కోట్లు.... 400.75 కోట్లు
6.55 ఎకరాల ప్లాట్‌కు ఎకరాకు 56.50 కోట్లు మొత్తం రూ. 379.070 కోట్లు
9.71 ఎకరాల ప్లాట్‌కు ఎకరానికి రూ. 51.75 కోట్లు.. మొత్తం రూ.502.49 కోట్లు
3.6 ఎకరాల ప్లాట్‌కు ఎకరానికి రూ. 72 కోట్లు.. మొత్తం రూ. 259.2 కోట్లు
మొత్తం రూ. 1532.5 కోట్ల ఆదాయం
10, 11, 14 ప్లాట్లకు 3 గంటలకు ప్రారంభమైన వేలం.. సాయంత్రం 6 గంటల ముగింపు.
Updated Date - 2023-08-03T17:17:24+05:30 IST