TS News: ముగ్గురు ఐపీఎస్‌లకు డీజీలుగా పదోన్నతి.. వారు ఎవరంటే..!
ABN, First Publish Date - 2023-08-07T17:29:29+05:30
తెలంగాణలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లకు డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ కేసీఆర్ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లకు డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ కేసీఆర్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. హైదరాబాద్ సీపీ సీవీ (cv anand). ఆనంద్‌తో పాటు జితేందర్, రాజీవ్ రతన్‌లకు డీజీలుగా పదోన్నతి కల్పించింది. ఈ ముగ్గురు అదనపు డీజీలకు డీజీలుగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం సీవీ. ఆనంద్ హైదరాబాద్ సీపీగా ఉన్నారు. రాజీవ్ రతన్.. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నారు. జితేందర్ హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీగా కొనసాగుతున్నారు. త్వరలోనే రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి అనుకూలమైన అధికారులను బదిలీలు చేయడం, ప్రమోషన్లు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.
Updated Date - 2023-08-07T17:29:29+05:30 IST