ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hero Sushanth Reddy : డ్రగ్స్ కేసులో టాలీవుడ్ యంగ్ హీరో?

ABN, First Publish Date - 2023-06-24T10:50:08+05:30

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ యంగ్ హీరో పేరు బయటకు రావడం కలకలం రేపుతోంది. నిర్మాత కేపీ చౌదరి చెప్పిన లిస్ట్‌లో హీరో సుశాంత్ రెడ్డి ఉండటం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ఫోన్‌ ద్వారా మీడియా సుశాంత్‌ను పకలరించగా.. ఈ ఆరోపణలను కొట్టిపడేశాడు. తనకు కేపీ చౌదరి ఒక ప్రొడ్యూసర్‌గా మాత్రమే తెలుసన్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో టాలీవుడ్ యంగ్ హీరో పేరు బయటకు రావడం కలకలం రేపుతోంది. నిర్మాత కేపీ చౌదరి చెప్పిన లిస్ట్‌లో హీరో సుశాంత్ రెడ్డి ఉండటం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ఫోన్‌ ద్వారా మీడియా సుశాంత్‌ను పకలరించగా.. ఈ ఆరోపణలను కొట్టిపడేశాడు. తనకు కేపీ చౌదరి ఒక ప్రొడ్యూసర్‌గా మాత్రమే తెలుసన్నాడు.

ఆయనను కొన్ని సార్లు కలిశానని.. అప్పుడపుడు కాల్స్ మాట్లాడానని సుశాంత్ తెలిపాడు. మూడేళ్ల నుంచి ఆయనను కలవలేదని వెల్లడించాడు. తనకు డ్రగ్స్ అలవాటు లేదని సుశాంత్ రెడ్డి స్పష్టం చేశాడు. డ్రగ్స్ పరంగా ఎలాంటి సంబంధం లేదని.. కేపీ చౌదరికి తనకూ మధ్య ఏనాడూ ఆ టాపిక్ కూడా రాలేదని వెల్లడించాడు. ఎలాంటి టెస్ట్ కి అయినా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. పోలీసుల నుంచి ఎదైనా కాల్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నానని.. ఎలాంటి విచారణకు అయినా తాను సిద్ధమని సుశాంత్ రెడ్డి స్పష్టం చేశాడు.

డ్రగ్స్ కేసులో సినీ లింక్స్‌పై సైబరాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిర్మాత కేపీ చౌదరి ద్వారా డ్రగ్స్ తీసుకున్న సెలబ్రిటీలను పోలీసులు గుర్తిస్తున్నారు. కేపీ చౌదరి అరెస్ట్ తో సినీ డ్రగ్స్ లింక్స్ తెర మీదకు వచ్చాయి. కేపీ చౌదరి అరెస్ట్‌తో పలువురు సెలబ్రిటీల్లో గుబులు నెలకొంది. రోషన్ అనే డ్రగ్స్ ఫెడ్లర్ విచారణలో కేపీ చౌదరి వ్యవహారం వెలుగు చూసింది. ప్రైవేట్ పార్టీలకు హాజరైన పలువురి ప్రముఖుల ఫోటోస్ సోషల్ మీడియా‌లో వైరల్ అయ్యాయి. దీని ఆధారంగా కేపీ చౌదరి నిర్వహించిన పార్టీలకు హాజరైన సెలబ్రిటీల లిస్ట్‌ను పోలీసులు తయారు చేస్తున్నారు.

Updated Date - 2023-06-24T14:05:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising