ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: అమావాస్య వేళ హైదరాబాద్‌లో హిజ్రా దారుణం

ABN, First Publish Date - 2023-04-21T10:32:06+05:30

భాగ్యనగరంలో నరబలి సంచలనం సృష్టిస్తోంది. అమావాస్య వేళ ఓ హిజ్రా ఇంతటి దారుణానికి పాల్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: భాగ్యనగరంలో నరబలి సంచలనం సృష్టిస్తోంది. అమావాస్య వేళ ఓ హిజ్రా ఇంతటి దారుణానికి పాల్పడినట్టు ప్రచారం జరుగుతోంది. నగరంలోని సనత్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ హిజ్రా 8 ఏళ్ల బాలుడిని హత్య చేసింది. ఈ ఘటనలో బలైన బాలుడు అబ్దుల్‌ వహీద్‌గా గుర్తించారు. అమావాస్య వేళ బాలుడిని హత్య చేయడంతో నరబలి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ నాలా సమీపంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. దీంతో కోపంతో ఊగిపోయిన స్థానికులు హిజ్రా ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. స్థానికుల ఆందోళనతో సనత్‌నగర్‌లోని అల్లాదున్ కోటి ఏరియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిన్న సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటి వచ్చిన అబ్దుల్ వహీద్ అనే బాలుడు నమాజ్ చేసేందుకు బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఇమ్రాన్ అనే హిజ్రా పిలవడంతో బాలుడు ఆమెతో కలిసి వెళ్లాడు. వీరిద్దరు కలిసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే కాసేపటికే బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాత్రి వెతికినప్పటికీ బాలుడి ఆచూకి లభించలేదు. ఇదిలా ఉండగా రాత్రి సమయంలో ఓ చోట క్షుద్రపూజలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, స్థానికులు అక్కడకు వెళ్లి చూడగా పూజలు జరిగినట్లు గుర్తించారు. నిన్న చాలా అరుదైన అమవాస్య కావడంతోనే ఈ పూజలు జరిగినట్లు గుర్తించారు. అనుమానంతో బాలుడి కోసం తీవ్రంగా గాలించగా... పక్కనే ఉన్న నాలాలో బాలుడి మృతదేహం లభించింది.

అయితే అప్పటికే హిజ్రా పరారీలో ఉంది. దీంతో బాలుడి మృతికి ఆమెనే కారణమంటూ హిజ్రా ఇంటిపై స్థానికులు దాడి చేసి ధ్వంసం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనతో అల్లాదున్ కోటి ఏరియా ప్రాంతంలో రాత్రంతా ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెల్లవారితే రంజాన్ పండుగ జరుపుకోనున్న సమయంలో బాలుడు ఈ విధంగా చనిపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇమ్రాన్ ఒక్కడేనా ఇంకెవరైనా సహాయం చేశారా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే రంజాన్ పండుగ వేళ ఈ విషాదం చోటు చేసుకోవడంతో బాలుడి తల్లిదండ్రులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-04-21T12:28:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising