IPS's: తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీ
ABN, First Publish Date - 2023-01-25T20:06:34+05:30
తెలంగాణలో భారీగా ఐపీఎస్ (IPS) అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐపీఎస్ (IPS) అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 60 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కరీంనగర్, రామగుండం సీపీలను ప్రభుత్వం బదిలీ చేసింది. నల్లగొండ, సిరిసిల్ల, మహబూబ్నగర్, వనపర్తి ఎస్పీలు బదిలీ అయ్యారు. రామగుండం సీపీగా సుబ్బారాయుడు, మల్కాజ్గిరి డీసీపీగా జానకి ధరావత్‌ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Updated Date - 2023-01-25T20:11:54+05:30 IST