Triangle Love Story : ప్రియురాలిని దక్కించుకునేందుకు ఎంతటి దారుణానికి ఒడిగట్టాడంటే..
ABN, First Publish Date - 2023-02-25T08:43:11+05:30
అదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని ప్రేమించారు. మరి అమ్మాయి వారిలో ఎవరిని ప్రేమించిందో తెలియదు కానీ అందులో ఓ యువకుడు మాత్రం దారుణానికి ఒడిగట్టాడు.
హైదరాబాద్ : అదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని ప్రేమించారు. మరి అమ్మాయి వారిలో ఎవరిని ప్రేమించిందో తెలియదు కానీ అందులో ఓ యువకుడు మాత్రం దారుణానికి ఒడిగట్టాడు. సినిమాల్లో చూడటమే తప్ప పెద్దగా బయట పెద్దగా ఇలాంటి ఘటనలు జరిగిన దాఖలాలైతే లేవు. ఒక అమ్మాయిని ఇద్దరు యువకులు ప్రేమించడం జరుగుతుందేమో కానీ.. అమ్మాయి కోసం దారుణాలకు ఒడిగట్టడం అనేది బయట పెద్దగా జరగిందైతే లేదు.
అసలేం జరిగిందంటే.. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నవీన్, హరిహర అనే ఇద్దరు యువకులు చదువుతున్నారు. అదే యూనివర్సిటీలో చదువుతున్న యువతిని వీరిద్దరూ ప్రేమించారు. అయితే హరిహరకు ప్రియురాలు తనకు దక్కదేమోనన్న అనుమానం కలిగింది. మరి ఆమె నవీన్‌తో క్లోజ్‌గా ఉండేదో ఏమో కానీ.. నవీన్‌పై కక్ష కట్టాడు. ఈ నెల 17వ తేదీన నవీన్‌ను పార్టీ పేరుతో హైదరాబాద్ శివారు ప్రాంతానికి పిలిచాడు. ఆపై అతడిని హత్య చేసి గుట్టలో పడేసి హరిహర అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కుమారుడు కనిపించకపోవడం.. అతని ఫోన్ కూడా పనిచేయకపోవడంతో నవీన్ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు నివ్వెరబోయే విషయాలు తెలిశాయి. నవీన్ మృతి దేహాన్ని హైదరాబాద్ శివారులో పోలీస్ అధికారులు గుర్తించారు. నవీన్ మృతదేహాన్ని రికవరీ చేసుకొని పోస్టుమార్టానికి తరలించారు. తాను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కకుండా పోతుందనే బాధతో నవీన్ హత్యకు హరిహర ప్లాన్ చేశాడని విచారణలో తేలింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
Updated Date - 2023-02-25T08:43:13+05:30 IST