ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC Leakage: టీఎస్‌పీఎస్సీ లీకేజ్ కేసులో మూడో రోజు నిందితుల విచారణ మొదలు

ABN, First Publish Date - 2023-03-28T10:33:30+05:30

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితుల కస్టడీ విచారణ మూడో రోజు మొదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage) కేసులో నలుగురు నిందితుల కస్టడీ విచారణ మూడో రోజు మొదలైంది. విచారణలో భాగంగా మంగళవారం ఉదయం నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్‌లను పోలీసులు సిట్ కార్యాలయాని (SIT Office) కి తీసుకొచ్చారు. ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు 15 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని సిట్ విచారిస్తోంది. ఏఈ ప్రశ్నాపత్ర లీకేజీ నిందితులు డాక్యా అండ్ టీం ఎంతమందికి పేపర్ అమ్మారనే విషయాలు రాబట్టే పనిలో సిట్ ఉంది. రేణుక, డాక్యా నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు అత్యధికంగా ప్రశ్నాపత్రాలు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

లీకేజ్‌లో భాగంగా చైన్ ప్రాసెస్‌పై సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. అక్టోబర్ 1న శంకర్ లక్ష్మి డైరీలో పాస్ వర్డ్‌ను ప్రవీణ్ కొట్టేసినట్లు తెలిసింది. గ్రూప్ 1, ఏఈ, టౌన్ ప్లానింగ్ పేపర్లు అన్ని అక్టోబర్‌లోనే ప్రవీణ్, రాజశేఖర్ కొట్టేసినట్లు సిట్ గుర్తించింది. ఈరోజుతో నలుగురు నిందితుల కస్టడీ ముగియనుంది. మరోవైపు A10 శమీమ్, A11 సురేష్, ఆ12 రమేష్ కస్టడీ పిటిషన్‌పై ఈరోజు నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది.

Updated Date - 2023-03-28T10:33:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising