ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC: అనేక మలుపులు తిరుగుతున్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు

ABN, First Publish Date - 2023-04-02T11:03:30+05:30

హైదరాబాద్: టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ కేసు (Paper Leakage Case) అనేక మలుపులు తిరుగుతోంది. చిన్న ఉద్యోగుల నుంచి ప్రారంభమైన విచారణ కమిషన్‌లోని పెద్దల వరకు వెళ్లింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ కేసు (Paper Leakage Case) అనేక మలుపులు తిరుగుతోంది. చిన్న ఉద్యోగుల నుంచి ప్రారంభమైన విచారణ కమిషన్‌లోని పెద్దల వరకు వెళ్లింది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ సెక్రెటరీ అనితా రామచంద్రన్ (Anita Ramachandran), సభ్యుడు లింగారెడ్డి (Linga Reddy)లను సిట్ అధికారులు (SIT Officers) విచారించారు. ప్రవీణ్ గ్రూప్ 1 పరీక్ష రాసినట్టు తనకు తెలుసని అనితా రామచంద్రన్ సిట్ ముందు చెప్పారు. అయితే ప్రవీణ్ డిస్ క్వాలిఫై కావడంతో అతనిపై అనుమానం రాలేదని చెప్పారు. కాగా తన పిఏ రమేష్ గ్రూప్ 1 రాసినట్టు తనకు తెలియదని లింగారెడ్డి చెప్పారు. అనితా రామచంద్రన్, లింగారెడ్డిలను సిట్ వేరు వేరుగా రెండు గంటల పాటు విచారించింది. మొత్తం పరీక్షల నిర్వహణ, కాన్ఫిడేన్షియల్‌పై సిట్ అధికారులు వివరాలు రాబట్టారు.

అనితా రామచంద్రన్‌‌‌‌ను శనివారం ఉదయం మహిళా ఎస్‌‌‌‌ఐలు మాధవి, మేఘన ఆధ్వర్యంలో విచారించారు. నిందితుడు ప్రవీణ్‌‌కు సంబంధించి ఆమె ఇచ్చిన స్టేట్‌‌మెంట్‌‌‌ను రికార్డ్ చేశారు. అనితా రామచంద్రన్‌‌‌‌ సిట్‌‌ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన తరువాత శనివారం మధ్యాహ్నం 2 గంటలకు టీఎస్‌‌పీఎస్సీ మెంబర్‌‌ లింగారెడ్డి విచారణకు వచ్చారు. ఆయనను కూడా దాదాపు రెండు గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రధాన నిందితులు ప్రవీణ్‌‌, రమేశ్​, షమీమ్​ ఇచ్చిన స్టేట్‌‌మెంట్స్ ఆధారంగా ఇద్దరినీ అధికారులు ప్రశ్నించారు.

మరోవైపు పేపర్ లీకేజీ కేసులో ఐదో రోజు ఆదివారం ముగ్గురు నిందితులను సిట్ అధికారులు విచారణ చేయనున్నారు. సీసీఎస్ నుంచి మరికొద్ది సేపట్లో హిమాయత్ నగర్ సిట్ కార్యాలయనికి నిందితులు రానున్నారు. చివరి రోజు విచారణ అనంతరం వారిని చంచల్ గూడ జైల్‌కు తరలించనున్నారు.

Updated Date - 2023-04-02T11:03:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising