ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC Leakage: ఏఈ పేపర్‌ కోసం ఇంతకు తెగించారా!.. లీకేజ్ కేసులో విస్తుపోయే అంశాలు

ABN, First Publish Date - 2023-03-30T11:58:51+05:30

రాష్ట్రాన్ని కుదిపేస్తున్న టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌ కేసులో రోజు రోజుకు అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌ (TSPSC Paper Leakage) కేసులో రోజు రోజుకు అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సిట్ విచారణ (SIT Investigation)లో తవ్వే కొద్దీ నిజనిజాలు బయటపడుతున్నాయి. తాజాగా ఈ కేసులో విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. గురువారం ఉదయం రెండో రోజు పేపర్ లీకేజీ నిందుతులను సిట్ ప్రశ్నిస్తోంది. ఈ కేసులో నిందితుడు డాక్యానాయక్ ఏఈ పేపర్‌తో దాదాపు రూ.25లక్షలు వసూలు చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ పేపర్ కోసం నీలేశ్, గోపాల్ నాయక్ రూ.13.5 లక్షలు చెల్లించారు. వీరిద్దరూ పొలం తాకట్టుపెట్టి మరీ ఇంత మొత్తంలో డబ్బును డాక్యాకు అప్పజెప్పి పేపర్‌ను కొనుగోలు చేశారు. అలాగే రాజేందర్ రూ.5 లక్షలు, ప్రశాంత్ రూ.7.5 లక్షలు చెల్లించినట్లు గుర్తించారు. ఏఈ ప్రశ్నాపత్రం కోసం ప్రశాంత్ బంగారం తాకట్టు పెట్టి మరీ రూ. 7 లక్షలు తెచ్చినట్లు విచారణలో బయటపడింది. డాక్యా నాయక్ బ్యాంక్ ఖాతాలను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు.

కాగా... టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్‌ అధికారులు చేసిన దర్యాప్తు ప్రకారం ఇప్పటి వరకు ఏఈ పేపర్లు 12 మందికి, గ్రూప్‌-1 పేపర్లు ఐదుగురికి లీకైనట్లు ప్రాథమికంగా నిర్థారించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు అరెస్టుల సంఖ్య 15కు చేరింది. న్యూజిలాండ్‌లో ఉన్న రాజశేఖర్‌రెడ్డి బావ ప్రశాంత్‌రెడ్డితో కలిసి నిందితుల సంఖ్య 16కు చేరుకుంది. లీకేజీ విషయం టీఎస్‌పీఎస్సీలో ఇంకా ఎంతమంది ఉద్యోగులకు తెలుసన్న కోణంలో సిట్‌ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కాగా, ఏఈ పేపర్‌ లీకేజీకి సంబంధించిన నలుగురు నిందితుల కస్టడీ మంగళవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. వారిని విచారించిన క్రమంలో పలు ఆసక్తికర విషయాలు తెలిసినట్లు సమాచారం. పేపర్‌ను కొన్న వారంతా అప్పులు చేసి, ఆస్తులు కుదువ పెట్టి.. రేణుక భర్త ఢాక్యా నాయక్‌, ఆమె తమ్ముడు రాజేశ్వర్‌కు డబ్బులిచ్చామని చెప్పినట్లు తెలిసింది.

Updated Date - 2023-03-30T12:02:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising