ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kushaiguda వేంకటేశ్వర స్వామి గుడి వద్ద అనుకోని ఘటన..

ABN, First Publish Date - 2023-02-22T09:01:09+05:30

కుషాయిగూడ వేంకటేశ్వర స్వామి గుడి వద్ద అనుకోని ఘటన జరిగింది. పొరపాటునో, గ్రహపాటునో ఓ ప్రాణం గాల్లో కలిసి పోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : కుషాయిగూడ వేంకటేశ్వర స్వామి గుడి వద్ద అనుకోని ఘటన జరిగింది. పొరపాటునో, గ్రహపాటునో ఓ ప్రాణం గాల్లో కలిసి పోయింది. అసలేం జరిగిందంటే.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద రంగయ్య (60) అనే వ్యక్తి వాచ్‌మెన్ డ్యూటీలో ఉన్నాడు. రాత్రి 11 గంటల సమయంలో ఓ యువకుడు గుడిలో చోరి నిమిత్తం వచ్చాడు.

గుడిలోకి వచ్చిన యువకుడు నేరుగా హుండీ దగ్గరకు వెళ్లి దానిని పగులగొట్టే పనిలో పడ్డాడు. దీనిని గమనించిన రంగయ్య వెంటనే అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సదరు యువకుడికి, రంగయ్యకు మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో యువకుడి తలకు వెనుక భాగాన తీవ్ర గాయమై నెత్తుటి మడుగులో నేలకొరిగి అలాగే మరణించాడు. వెంటనే రంగయ్య పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు వచ్చి మృతుడిని క్షుణ్ణంగా పరిశీలించగా.. వారికి అతని ఫోన్ దొరికింది. ఫోన్‌లోని ఆధారాలను బట్టి దొంగతనానికి వచ్చిన యువకుడు గండం రాజు (23)గా పోలీసులు గుర్తించారు. రాజు స్వస్థలం కామారెడ్డి జిల్లా ఆరేపల్లి. పోలీసులు యువకుడు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు.

Updated Date - 2023-02-22T09:01:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising