Hyderabad: యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్ల ఆందోళన
ABN, First Publish Date - 2023-09-08T14:40:23+05:30
హైదరాబాద్: యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లు ఆందోళన చేపట్టారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. నిజాం కాలేజీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో గన్‌పార్క్ వద్దకు ర్యాలీగా వెళ్లిన వారిని పోలీసులు అడ్డుకుని.. ఆందోళన చేస్తున్నవారిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లు (University Contract Teachers) ఆందోళన (Protest) చేపట్టారు. తమను రెగ్యులరైజ్ (Regularize) చేయాలని డిమాండ్ చేస్తూ.. నిజాం కాలేజీ (Nizam College)లో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు (Contract Assistant Professors) నిరసన చేపట్టారు. ఈ క్రమంలో గన్‌పార్క్ (Gunpark) వద్దకు ర్యాలీగా వెళ్లిన వారిని పోలీసులు అడ్డుకుని.. ఆందోళన చేస్తున్నవారిని అరెస్ట్ చేశారు. 12 యూనివర్సిటీలలో పెన్‌డౌన్ (Pendown)లో భాగంగా గన్‌పార్క్ వరకు ర్యాలీకు పిలుపిచ్చారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు టీచర్స్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని అనేక రకాలుగా విజ్ఞప్తి చేసినా.. తమను ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ (CM KCR) ఇచ్చిన హామీని.. అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంతో మందికి పాఠాలు చెప్పామని, గొప్పవారు అయ్యారని.. పోలీసులు అయ్యారని.. ఇపుడు ఆ పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేయిస్తున్నారని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు వాపోయారు. ఇంత దారుణమా.. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల వరకు హామీని నెరవేర్చలేదని.. ఇంకెప్పుడు చేస్తారని ప్రశ్నించారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ స్పందించి న్యాయం చేయకపోతే.. 11వ తేదీ నుంచి ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలంగాణ యూనివర్సిటీస్ కాంట్రాక్టు టీచర్స్ సంఘం స్పష్టం చేసింది.
Updated Date - 2023-09-08T14:40:23+05:30 IST