ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vemula Veeresham : అన్యాయం జరిగింది కాబట్టే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశా

ABN, First Publish Date - 2023-08-24T12:35:37+05:30

తాజాగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. తమకు టికెట్ రాకపోవడంతో కొందరు ఆశావహులు పార్టీని వీడుతున్నారు. వారిలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఒకరు. తనకు అన్యాయం జరిగింది కాబట్టే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని వేముల వీరేశం అన్నారు.

నల్గొండ : తాజాగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. తమకు టికెట్ రాకపోవడంతో కొందరు ఆశావహులు పార్టీని వీడుతున్నారు. వారిలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఒకరు. తనకు అన్యాయం జరిగింది కాబట్టే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని వేముల వీరేశం అన్నారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. నకిరేకల్ ఎమ్మెల్యే అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. కూల్చివేతలు తప్ప తమ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చేసిందేమి లేదన్నారు. తన హాయంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా, ఏ పార్టీలోకి వెళ్లినా నకిరేకల్‌లో గెలిచేది తానేనని వేముల వీరేశం స్పష్టం చేశారు.

Updated Date - 2023-08-24T12:35:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising