ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayashanti : ఆ చేరికల్లో ఏ ఒక్కటీ తక్కువ కాదు...

ABN, First Publish Date - 2023-04-23T22:50:03+05:30

మునుగోడు ఉపఎన్నిక (munugodu by-election)లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Komati Reddy Rajagopal Reddy)ని గెలవనీయకుండా ప్రత్యర్థి పార్టీల నేతలు వ్యూహాలు పన్నారని, ఆయన గెలవకపోవడంతో బీజేపీ( BJP)లోకి చేరికలు ఆగిపోయాయని బీజేపీ వ్యతిరేకులు అనడం అవివేకమని ఆ పార్టీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్(Hyderabad): మునుగోడు ఉపఎన్నిక (munugodu by-election)లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Komati Reddy Rajagopal Reddy)ని గెలవనీయకుండా ప్రత్యర్థి పార్టీల నేతలు వ్యూహాలు పన్నారని, ఆయన గెలవకపోవడంతో బీజేపీ( BJP)లోకి చేరికలు ఆగిపోయాయని బీజేపీ వ్యతిరేకులు అనడం అవివేకమని ఆ పార్టీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు. ఆదివారం సోషల్ మీడియా(Social media)లో ఈ మేరకు రాములమ్మ ఓ వార్త పోస్ట్ చేశారు. ఆమె ఏమన్నారంటే.. బీజేపీలో ఇప్పటికీ పలు పార్టీల నుంచి చేరికలు జరుగుతునే ఉన్నాయి. గ్రేటర్ ఎన్నిక(Greater election)ల విజయం, హుజురాబాద్(Huzurabad) ఎన్నికల విజయాల అనంతరం కూడా పార్టీలోకి చేరికలు జరిగినప్పటికీ ప్రభుత్వ నియంత్రిత ప్రసారసాధనాల్లో అవి ఎక్కువగా కనపడట్లేదని చెప్పారు. అదేవిధంగా మునుగోడు ఉపఎన్నిక తర్వాత జరిగిన అనేక చేరికలు ప్రచారంలో పెద్దగా ప్రాధాన్యం సంతరించుకోనప్పటికీ, ఆ చేరికల్లో ఏ ఒక్కటీ తక్కువ కాదు. ప్రతి కార్యకర్త పార్టీలో చేరడం బీజేపీకి అత్యంత గౌరవనీయమైనదేనని విజయశాంతి తెలిపారు.

Updated Date - 2023-04-23T23:02:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising