Hyderabad: ఈఎస్ఐ ఆసుపత్రిలో దారుణానికి పాల్పడ్డ యువకుడి అరెస్ట్..
ABN, First Publish Date - 2023-09-19T09:48:00+05:30
హైదరాబాద్: ఈఎస్ఐ ఆసుపత్రిలో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ యువకుడుని పోలీసులు అరెస్టు చేశారు. ఆస్పత్రిలో రోగి సోదరిపై షాబాద్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. లిఫ్టులో బలవంతంగా పైకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు.
హైదరాబాద్: ఈఎస్ఐ ఆసుపత్రిలో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ యువకుడుని పోలీసులు అరెస్టు చేశారు. ఆస్పత్రిలో రోగి సోదరిపై షాబాద్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. లిఫ్టులో బలవంతంగా పైకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏస్అర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మూడు రోజుల నుంచి పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకున్నారు. సోదరుడి చికిత్స కోసం కర్ణాటక నుంచి ఈఎస్ఐ ఆసుపత్రికి యువతి వచ్చింది.
శుక్రవారం రాత్రి సోదరుడికి భోజనం తీసుకురావటానికి ఆమె కిందకు వచ్చింది. తిరిగి వెళ్లే సమయంలో క్యాంటీన్‌లో పని చేసే షాదాబ్ ఆమెను పరిచయం చేసుకుని ఏమైనా సాయం కావాలంటే చేస్తానని చెప్పాడు. అనంతరం ఆమె లిఫ్టులో వెళుతున్నప్పుడు యువకుడు ఆమె వెనకాలవెళ్లి లిఫ్టులో బలవంతంగా ఆమెను రెండో అంతస్తులోని చీకటి ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత రక్తపరీక్షలు చేసే గదిలో మరోసారి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేయగా వారు పోలీసులకు సమాచారం అందించారు. భాదితురాలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు షాదాబ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Updated Date - 2023-09-19T09:48:00+05:30 IST