ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sharmila: రాజ్యాంగం ఎందుకు మార్చాలో సీఎం కేసీఆర్ చెప్పాలి..

ABN, First Publish Date - 2023-04-14T12:29:51+05:30

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆమె ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికలు దగ్గరకు వచ్చాక అంబేద్కర్ విగ్రహం (Ambedkar Statue) వచ్చిందని, తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం (KCR Constitution) నడుస్తోందన్నారు. రాజ్యాంగం ఎందుకు మార్చాలో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి కుటుంబంలో ఐదు ఉద్యోగాలు ఉన్నాయని విమర్శించారు. విగ్రహం పెట్టినంత మాత్రాన దళితులపై ప్రేమ ఉన్నట్టు కాదన్నారు.

సీఎం కేసీఆర్ రాజ్యాంగంలో ప్రజలకు హక్కులు లేవని, ఆయన రాజ్యాంగాన్ని అవమాన పరిచారని షర్మిల అన్నారు. బీఆర్ఎస్ రాజ్యాంగంలో ప్రతిపక్షాలకు కొట్లాడే హక్కు లేదని, దళితులను అన్ని రకాలుగా సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ ఒక ఆఫ్గనిస్తాన్ అని, సీఎం ఒక తాలిబాన్ నేతని అన్నారు. అసలు తెలంగాణలో రాజ్యాంగం ఉందా? అని ప్రశ్నించారు. ఇండియన్ రాజ్యాంగాన్ని తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలకు కొట్లాడే స్పేస్ ఇవ్వాలన్నారు. కేసీఆర్ అంబేద్కర్ వారసుడని అంటున్నారని.. దీనికంటే పెద్ద జోక్ ఇంకొకటిలేదన్నారు. దళితులను జైల్లో చిత్రహింసలు పెట్టి చంపుతున్నారని, అన్ని పాలసీలకు దళితుల భూమి దోచుకుంటున్నారని ఆరోపించారు. అంబేద్కర్ వారసుడనని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రికి సిగ్గు ఉండాలని షర్మిల వ్యాఖ్యానించారు.

కాగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 125 అడుగుల బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. అంబేడ్కర్‌ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌తో కలిసి సీఎం కేసీఆర్‌ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. బౌద్ధ భిక్షువుల ప్రార్థనలతో ఆవిష్కరణ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఆవిష్కరణ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెక్లెస్‌రోడ్డులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అన్ని నియోజకవర్గాల ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి 6 బస్సుల చొప్పున ఏర్పాటు చేసి.. ఒక్కో బస్సులో 45మందిని తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఒక్కో బస్సుకు రక్షణగా ఒక అధికారి, ఒక కానిస్టేబుల్‌ ఉండనున్నారు.

Updated Date - 2023-04-14T12:29:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising