ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

T.Highcourt: ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ రద్దుపై ముగిసిన వాదనలు.. తీర్పు వాయిదా

ABN, First Publish Date - 2023-04-26T12:36:12+05:30

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Viveka Case) హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్రగంగిరెడ్డి (Erragangireddy) బెయిల్ రద్దుపై హైకోర్టులో (Telangana High Court) వాదనలు ముగిశాయి. సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు విచారణకు సహకరించడం లేదని సీబీఐ తరపు న్యాయవాదులు తెలిపారు. గంగిరెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేయడంలేదని గంగిరెడ్డి తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువర్గాల వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రేపటి(గురువారం)కి వాయిదా వేసింది.

వివేకా హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో సీబీఐ పిటిషన్‌ వేసింది. గత రెండు నెలలుగా ఈ పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. ఈరోజు కూడా బెయిల్‌ రద్దు పిటిషన్‌పై వాదనలు జరుగగా తీర్పును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఎర్రగంగిరెడ్డి బయట ఉండటం సమంజసం కాదని, సాక్ష్యులను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని, అలాగే సాక్ష్యులను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారని అలాగే సాక్షాలను తారుమారు చేస్తున్నారని సీబీఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే ఎర్రగంగిరెడ్డి ఎక్కడా కూడా సాక్ష్యులను ప్రభావితం చేయలేదని ఎర్రగంగిరెడ్డి తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఎర్రగంగిరెడ్డి బెయిల్ నిబంధనలు విస్మరించకుండా.. నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నారని తెలిపారు. సీబీఐ అధికారులు పిలిచిన ప్రతీసారి ఎర్రగంగిరెడ్డి విచారణకు హాజరయ్యారని, 72 సార్లు సీబీఐ ఎదుట హాజరయ్యారని కోర్టుకు చెప్పారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. గురువారం తుది తీర్పు వెల్లడిస్తామని తెలిపింది.

గతంలో ఎర్రగంగిరెడ్డి బెయిల్‌‌ను రద్దు చేయాలని ఏపీ హైకోర్టును (AP Highcourt) సీబీఐ ఆశ్రయించగా.. న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టు తీర్పుపై సీబీఐ సుప్రీం కోర్టులో (Supreme Court) పిటిషన్‌ వేసింది. అయితే అప్పటికే వివేకా కేసు తెలంగాణకు బదిలీ అయిన నేపథ్యంలో హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీం సూచించింది. ఈ మేరకు ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ... తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈరోజు హైకోర్టులో వాదనలు ముగియగా.. తీర్పు రేపటికి వాయిదా పడింది. ఈ క్రమంలో ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దుపై తెలంగాణ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనే ఉత్కంఠ నెలకొంది.

Updated Date - 2023-04-26T13:13:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising