IT searches: కింగ్స్ గ్రూపు అధినేత షానవాజ్ ఇంట్లో ఐటీ సోదాలు
ABN, First Publish Date - 2023-11-26T11:13:22+05:30
పాతబస్తీకి చెందిన కింగ్స్ గ్రూపు అధినేత షానవాజ్(Shanawaz) ఇంట్లో ఐటీ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు.
చాంద్రాయణగుట్ట(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): పాతబస్తీకి చెందిన కింగ్స్ గ్రూపు అధినేత షానవాజ్(Shanawaz) ఇంట్లో ఐటీ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. ఒక రాజకీయ పార్టీకి ఆయన పెద్ద మొత్తంలో డబ్బులు సమకూరుస్తున్నట్లు సమాచారం అందడంతో ఐటీ అధికారులు తనిఖీలు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై ఐటీ అధికారులు ఎలాంటి వివరాలు బయటకు వెల్లడించడంలేదు. గతంలోనూ పలుమార్లు ఆయన ఇంట్లో ఐటీ సోదాలు జరగడం గమనార్హం.
Updated Date - 2023-11-26T11:13:23+05:30 IST