ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jaggareddy: కేసీఆర్‌తో జగ్గారెడ్డి భేటీ

ABN, First Publish Date - 2023-02-09T18:53:09+05:30

అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ (CM KCR)ను ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) కలిశారు. మెట్రో రైల్ లైన్ (Metro Rail Line) సంగారెడ్డి వరకు విస్తరించాలని విజ్ఞప్తి చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ (CM KCR)ను ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) కలిశారు. మెట్రో రైల్ లైన్ (Metro Rail Line) సంగారెడ్డి వరకు విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నియోజకవర్గ సమస్యలపై జగ్గారెడ్డి వినతిపత్రం ఇచ్చారు. దళితబంధు కోసం 550 మంది జాబితాను కేసీఆర్‌కు జగ్గారెడ్డి ఇచ్చారు. అంతేకాకుండా సదాశివపేట సిద్దాపూర్‌లో పేదలకు ప్లాట్స్ ఇవ్వాలని జగ్గారెడ్డి కోరారు. మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ అంశాన్ని జగ్గారెడ్డి అసెంబ్లీలో మరోసారి లేవనెత్తారు. మియాపూర్‌ (Miyapur) నుంచి సంగారెడ్డి రామమందిర్‌.. సదాశివపేట ఎంఆర్‌ఎఫ్‌ వరకు మెట్రో రైలును పొడిగించాలని శాసనసభ వేదికగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు (Harish Rao)ను కోరారు. శాసనసభలో బుధవారం బడ్జెట్‌పై జరిగిన చర్చలో భాగంగా జగ్గారెడ్డి మాట్లాడారు. ప్రతిపక్షాలు ఏది అడిగినా చేసేశామని హరీశ్‌ రావు చెబుతున్నారని అన్నారు. సంగారెడ్డి (Sangareddy)కి ప్రభుత్వం మెడికల్‌ కాలేజీ ఇచ్చిన మాట వాస్తవమని, అదే విధంగా సంగారెడ్డి, సదాశివపేటకు మెట్రో సేవలను పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఆర్థిక మంత్రి, జిల్లా మంత్రి కూడా అయిన హరీశ్‌రావు నిర్ణయం తీసుకునే వ్యక్తి అయినందున ఆయన దృష్టికి ఈ విషయం తెస్తున్నానని చెప్పారు. సంగారెడ్డి, సదాశివపేటకు మెట్రోను తీసుకువచ్చే ఆలోచన చేయాలని జగ్గారెడ్డి కోరారు. ఇందుకు స్పందించిన హరీశ్‌.. మెట్రో ప్రాజెక్టు విస్తరణ అంశం విధానపరమైన నిర్ణయమని, సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

Updated Date - 2023-02-09T18:53:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising