ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Heavy rains: హమ్మయ్యా.. తెరుచుకున్న కడెం ప్రాజెక్టు మరో రెండు గేట్లు.. భద్రాచలం వద్ద గోదావరి పరిస్థితి ఏంటంటే..

ABN, First Publish Date - 2023-07-27T19:56:50+05:30

టెన్షన్‌కు తెరపడింది. నిండు కుండలా తొణికిసలాడుతున్న కడెం ప్రాజెక్టు (Kadam Project ) మరో రెండు గేట్లు కూడా తెరచుకున్నాయి. కొన్ని గంటలపాటు అధికారులు శ్రమించి ఈ గేటును తెరిపించారు. దీంతో బుధవారం నుంచి నెలకొన్ని ఉత్కంఠకు గురువారం తెరపడింది. ప్రాజెక్ట్ పూర్తిగా నిండిపోయి పైకెక్కి మరి ప్రవహిస్తుండడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే ఎట్టకేలకు సాయంత్రం సమయంలో రెండు కూడా తెరచుకున్నాయి.

నిర్మల్: టెన్షన్‌కు తెరపడింది. నిండు కుండలా తొణికిసలాడుతూ.. భయపెట్టిన కడెం ప్రాజెక్టు (Kadam Project ) మరో రెండు గేట్లు కూడా తెరుచుకున్నాయి. ఓపెన్ అవ్వకుండా మొరాయించిన గేట్లను అధికారులు కొన్ని గంటలపాటు శ్రమించి తెరిపించారు. దీంతో బుధవారం నుంచి నెలకొన్న ఉత్కంఠకు గురువారం సాయంత్రం తెరపడింది. ప్రాజెక్ట్ పూర్తిగా నిండిపోయి పైకెక్కి మరి ప్రవహిస్తుండడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఏ రూపంలో ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందోనన్న భయాలు వ్యక్తమవయ్యాయి. అయితే ఎట్టకేలకు సాయంత్రం సమయంలో రెండు గేట్లు తెరచుకోవడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.

ఇక కడెం ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 1.58 లక్షలు.. కాగా ఔట్‌ఫ్లో 2.28 లక్షల క్యూసెక్కులుగా ఉంది. మొత్తం 16 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. కడెం ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 697.200 అడుగులుగా ఉందని అధికారులు వెల్లడించారు.


మరోవైపు.. భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌కు వరద ఉద్ధృతి పెరిగింది. గడ్డెన్నవాగు ఇన్ఫ్లో 1,08,792 కాగా.. ఔట్‌ఫ్లో 1,18,582 క్యూసెక్కులుగా ఉంది. గడ్డెన్నవాగు దగ్గర ఏడు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేశారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 358.70 మీటర్లు కాగా సంపూర్ణ నీటి నిలువ సామర్థ్యం 1.852 టీఎంసీలుగా ఉంది.

భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి ఉధృతి..

భద్రాచలం దగ్గర గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. 48.40 అడుగులకు శాంతించింది. ఇక 11,63,596 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. మరోవైపు రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Updated Date - 2023-07-27T20:03:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising