ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tragic Incident: మరో రెండు గంటల్లో కూతురు పెళ్లి.. ఇంతలో ఇలా జరిగిందేంటో..!

ABN, First Publish Date - 2023-09-04T07:22:03+05:30

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని అంబాలాపూర్‌ గ్రామంలో పెళ్లింట విషాదం నెలకొంది. మరో రెండు గంటల్లో కూతురి పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి కూతురు తండ్రి గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబాలాపూర్‌ గ్రామానికి చెందిన ఎర్రల రాములు (48) మండల కేంద్రంలో ట్రాక్టర్‌ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని అంబాలాపూర్‌ గ్రామంలో పెళ్లింట విషాదం నెలకొంది. మరో రెండు గంటల్లో కూతురి పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి కూతురు తండ్రి గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబాలాపూర్‌ గ్రామానికి చెందిన ఎర్రల రాములు (48) మండల కేంద్రంలో ట్రాక్టర్‌ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రాములు-మంజుల దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వారిలో పెద్ద కూతురు లావణ్య వివాహం ఆదివారం ఉదయం 10 గంటలకు కొత్తగట్టు శ్రీమత్స్య గిరీంద్రస్వామి గుట్టపై జరగాల్సి ఉంది.


పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరో రెండు గంటల్లో పెళ్లి జరుగుతుండగా పెళ్లి కూతురు తండ్రి ఎర్రల రాములు గుండెలో నొప్పితో కుప్పకూలిపోయాడు. బంధువులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే రాములు మృతి చెందినట్లు తెలిపారు. మరో రెండు గంటల్లో కూతురు పెళ్లి చేయాల్సిన తండ్రి గుండెపోటుతో మృతి చెందడంతో పెళ్లి ఆగిపోయింది. సంతోషంతో కళకళలాడాల్సిన పెళ్లింట రోధనలు మిన్నంటాయి. రాములు మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. భార్య ముగ్గురు కుమార్తెల రోధనలు పలువురిని కంటతడి పెట్టించాయి.

Updated Date - 2023-09-04T07:22:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising