మహాశివరాత్రి ఉత్సవాలకు రండి

ABN, First Publish Date - 2023-02-13T00:41:23+05:30

వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో నిర్వహించనున్న మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు హాజరుకావాలని స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావును కోరారు.

మహాశివరాత్రి ఉత్సవాలకు రండి
సీఎం కేసీఆర్‌కు మహాశివరాత్రి ఆహ్వాన పత్రిక అందజేస్తున్న ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సీఎం, మంత్రులకు ఆహ్వాన పత్రిక అందజేత

వేములవాడ, ఫిబ్రవరి 12 : వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో నిర్వహించనున్న మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు హాజరుకావాలని స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావును కోరారు. ఈ మేరకు ఆదివారం నాడు ఆయన ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి మహాశివరాత్రి జాతర ఉత్సవాల ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ నెల 17వ తేదీ నుండి మూడు రోజుల పాటు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలలో పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్‌ను కోరారు.

మంత్రులకు ఆహ్వానం

మహాశివరాత్రి వేడుకలకు హాజరుకావాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో మంత్రులను కలిశారు. వేములవాడ దేవస్థానం ఈవో డి.కృష్ణప్రసాద్‌తో కలిసి ఆహ్వానపత్రికలను అందజేశారు.

Updated Date - 2023-02-13T11:58:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising