కరీంనగర్‌లో విషాదం... ట్రైనింగ్ కోసం వెళ్లి కానిస్టేబుల్ హఠాన్మరణం
ABN, First Publish Date - 2023-05-25T18:17:18+05:30
పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో విషాదం చోటుచేసుకుంది. 2004 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ రను సింగ్

Constable
కరీంనగర్: పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో విషాదం చోటుచేసుకుంది. 2004 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ రను సింగ్ హఠాన్మరణం చెందాడు. హైదరాబాద్ నుంచి కరీంనగర్‌లో జరుగుతున్న హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్ కోసం వెళ్లాడు. ట్రైనింగ్ జరుగుతున్న సమయంలో హఠాత్తుగా రను సింగ్ కింద పడిపోయాడు. దీంతో పోలీసులు స్థానిక ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Updated Date - 2023-05-25T18:17:18+05:30 IST