ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Korutla Deepthi Case: దీప్తిని లేకుండా చేసిందెవరో తెలిసిపోయింది.. ఒంగోలులోని ఓ లాడ్జిలో..

ABN, First Publish Date - 2023-09-02T15:49:44+05:30

కోరుట్లలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దీప్తి కేసులో మిస్టరీ వీడింది. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దీప్తిని ఆమె చెల్లెలు చందన హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీప్తి చెల్లి చందన హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుతున్నట్లు తెలిసింది. కాలేజీలో సీనియర్‌ను చందన ప్రేమించింది. మతాంతర వివాహానికి తల్లిదండ్రులు, అక్క దీప్తి అభ్యంతరం తెలిపారు. దీంతో.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దీప్తిని చందన హత్య చేసి పరారైంది.

జగిత్యాల: కోరుట్లలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దీప్తి కేసులో మిస్టరీ వీడింది. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దీప్తిని ఆమె చెల్లెలు చందన హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీప్తి చెల్లి చందన హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుతున్నట్లు తెలిసింది. కాలేజీలో సీనియర్‌ను చందన ప్రేమించింది. మతాంతర వివాహానికి తల్లిదండ్రులు, అక్క దీప్తి అభ్యంతరం తెలిపారు. దీంతో.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దీప్తిని చందన హత్య చేసి పరారైంది. చందనకు బంధువులు, కారు డ్రైవర్‌ సహకరించినట్లు సమాచారం.


దీప్తి మృతి చెందిన రోజు నుంచి ఈ కేసు రోజుకో మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. దీప్తి చనిపోయిన రోజు నుంచే చందన కనిపించకుండాపోవడంతో ఆమెపై అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే.. అక్కను తానెందుకు చంపుతానని ఎమోషనల్‌గా చందన పంపిన వాయిస్ మెసేజ్‌తో ఈ కేసులో గందరగోళం ఏర్పడింది. దీప్తిని ఆమె చెల్లెలు చంపకపోయి ఉంటే దొంగలెవరైనా ఇలా చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంట్లో దాదాపు కోటి రూపాయల విలువ చేసే బంగారం, 2 లక్షల డబ్బు కూడా కనిపించకపోవడంతో దొంగల పనై ఉంటుందనే అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ కేసులో చిక్కుముడి వీడాలంటే ఇంట్లో నుంచి వెళ్లిపోయిన చందనను అదుపులోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావించారు. ఆమె కోసం వెతుకులాట సాగించగా ప్రకాశం జిల్లాలో ఆమె ఉన్నట్లు తేలింది.

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు తనిఖీలు చేయగా ఒంగోలులోని ఒక లాడ్జిలో చందన, ఆమె బాయ్ ఫ్రెండ్, డ్రైవర్‌ పట్టుబడ్డారు. ఈ నిందితులను ఒంగోలు నుంచి జగిత్యాల తీసుకువచ్చి పోలీసులు విచారించగా అసలు నిజం బయటపడింది. దీప్తి మృతిని పోలీసులు హత్యగా భావించడానికి కారణం లేకపోలేదు. దీప్తి పోస్ట్‌మార్టం రిపోర్టులో ఆమె ఒంటిపై గాయాలు ఉన్నట్లు తేలడంతో ఇది హత్యగానే భావిస్తూ పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. కోరుట్ల సీఐ ప్రవీణ్ కుమార్‌తో కలిసి కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి ఎస్‌ఐలు కిరణ్ కుమార్, చిరంజీవి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఒంగోలుకు వెళ్లి ప్రత్యేక విచారణ చేపట్టారు. అక్కడ చందన ఫోన్ సిగ్నల్స్‌ను ట్రేస్ చేసిన పోలీసులు ఆమె ఉన్న ప్రాంతాన్ని గుర్తించి చందనతో పాటు మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కోరుట్ల పట్టణంలో దీప్తి హత్యపై వస్తున్న వరుస కథనాలకు ఈ పరిణామం దాదాపు ముగింపు పలికినట్టేనని చెప్పొచ్చు.

Updated Date - 2023-09-02T15:55:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising