Khammam.. తలపెట్టిన ఏ కార్యక్రమం ఆపే ప్రసక్తే లేదు: మంత్రి నిరంజన్ రెడ్డి
ABN, First Publish Date - 2023-02-01T15:48:49+05:30
కరోనా పరిస్థితుల్లో రుణ మాఫీ అమలు చేయలేకపోయామని.. అయినా వడ్డీతో సహా రుణ మాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
ఖమ్మం జిల్లా: కరోనా (Corona) పరిస్థితుల్లో రుణ మాఫీ అమలు చేయలేకపోయామని.. అయినా వడ్డీతో సహా రుణ మాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, మాదాపురం రైతు వేదిక ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తలపెట్టిన ఏ కార్యక్రమం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిన్న మొన్న మన సోదరుడు పొంగులేటి (Ponguleti) ఏదేదో మాట్లాడుతున్నారు.. నిన్నటి వరకు ఉన్న కరెంటు ఈ రోజు చీకటి అయిందట.. కరంటు ఎక్కడ అని ప్రశ్నిస్తూ ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. ముందు తెలంగాణలో అమలవుతున్న పథకాల గురించి చెప్పాలన్నారు.
రానున్న రోజుల్లో ఇంతకంటే ఎక్కువ తెలంగాణ పధకాల ఔన్నత్యాన్ని చెప్పాల్సి వస్తుందని.. గుర్తు పెట్టుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇంతకంటే ఘనంగా తెలంగాణలో ఎవరు మంచిగా చేస్తారో, దమ్మున్నవాళ్లు ముందుకు రావాలని సవాల్ చేశారు. ప్రజాక్షేత్రంలో ప్రజల మనస్సు గెలవాలని.. మన్నన పొందాలని అన్నారు. కేవలం ప్రభుత్వాన్ని, ప్రజల పాలకులను తిడితే అధికారం రాదని గ్రహించాలన్నారు వ్యవసాయంలో ఆధునిక పద్దతులు పాటించాలని, భూసారం పెంచుకుంటే అధిక దిగుబడులు వస్తాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
Updated Date - 2023-02-01T15:48:53+05:30 IST