ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tenth paper leakage: విద్యార్థుల జీవితాలతో ఆటలాడ లేదు: జర్నలిస్ట్ ప్రశాంత్

ABN, First Publish Date - 2023-04-12T10:19:05+05:30

విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడలేదని జర్నలిస్ట్ ప్రశాంత్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కరీంనగర్: విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడలేదని జర్నలిస్ట్ ప్రశాంత్ (Journalist Prashant) అన్నారు. టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ కేసు (Tenth Paper Leakage Case)లో జిల్లా జైలులో ఉన్న ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో(ABN- Andhrajyothy) ప్రశాంత్ మాట్లాడుతూ... ఎన్నిమిదేళ్లుగా విద్యార్థుల సమస్యల కోసం తాను పోరాటం చేస్తున్నానని తెలిపారు. పేపర్ లీకేజీకి ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ (BJP Leader Bandi Sanjay)తో చాలా సేపేమీ మాట్లాడలేదన్నారు. రాజకీయ పార్టీల నేతలతో తనకు ముందు నుంచి మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. జర్నలిస్టుగా వాట్సాప్ గ్రూపుల్లో పేపర్‌ను పోస్ట్ చేసినట్లు తెలిపారు. తనపై కుట్ర పూరిత కేసు పెట్టారని మండిపడ్డారు. జర్నలిస్టులు ప్రశ్నించొద్దా... సమాచారం చేరవేయడం తప్పా అని ప్రశాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈనెల నాలుగున టెన్త్ హిందీ పేపర్ లీకేజ్ సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ప్రశాంత్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెన్త్ పేపర్‌ను వాట్సప్‌లో ప్రశాంత్ పలువురికి షేర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల సహా పలువురికి పేపర్ పంపినట్లు చెప్పారు. ఈ క్రమంలో బండి సంజయ్‌ను గత వారం కరీంనగర్‌లో అర్ధరాత్రి అరెస్ట్ చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆయనను ముందుగా బొమ్మలరామారం పోలీస్‌స్టేషన్‌కు తరలించి అక్కడి నుంచి వరంగల్‌కు తీసుకెళ్లారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో బండి సంజయ్‌ను కరీంనగర్‌ జైలు తరలించారు. అయితే హనుమకొండ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో గత శుక్రవారం కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. అలాగే నిన్న ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో పాటు బండి సంజయ్‌ని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో ప్రశాంత్ జైలు నుంచి విడుదలయ్యారు.

Updated Date - 2023-04-12T10:34:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising