KBC Program: కేబీసీ ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డిపై అమితాబ్ ప్రశ్న..ఆన్సర్ చెప్పారా?
ABN, Publish Date - Dec 29 , 2023 | 06:09 PM
కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో భాగంగా వచ్చిన పోటీదారునికి అమితాబ్ తెలంగాణ సీఎం గురించి ఓ ప్రశ్న వేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
ప్రస్తుతం కొనసాగుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) సీజన్ 15లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 15న ప్రసారమైన ఎపిసోడ్‌లో ఈ కార్యక్రమం హోస్ట్ అమితాబ్.. పోటీకి వచ్చిన యువతికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి ప్రశ్న వేశారు. ఆ క్రమంలో రేవంత్ రెడ్డి ఏ రాష్ట్రానికి ఇటివల సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని క్వశ్ఛన్ వేశారు. ఆమెను 40 వేల రూపాయల ప్రశ్నగా దీనిని బిగ్ బీ అడిగారు. అంతేకాదు ప్రశ్నదిగువన ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అనే ఆప్షన్లు కూడా ఇచ్చారు.
కానీ ఆమెకు ఆ ప్రశ్నకు సమాధానం తెలియలేదు. దీంతో ఆమె ఆ ప్రశ్న సమాధానం కోసం లైఫ్‌లైన్ సహాయం తీసుకున్నారు. ఆ క్రమంలో 80 శాతం మంది తెలంగాణ అని జవాబు చెప్పగా..11 శాతం మంది ఛత్తీస్ గఢ్ అని ఆన్సర్ ఇచ్చారు. మిగిలిన వారు సీ, డీ ఆప్షన్లను ఎంచుకున్నారు. చివరకు ఎక్కువ మంది తెలంగాణ అని చెప్పడంతో ఆ యువతి సరైన సమాధానం ఎంచుకుని తదుపరి ప్రశ్నకు అర్హత సాధించారు. అయితే అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 'కౌన్ బనేగా కరోడ్‌పతి 15' సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు సోనీ టీవీలో ప్రసారం అవుతుంది. ఇది SonyLIV యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది.
Updated Date - Dec 29 , 2023 | 06:14 PM