ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth Reddy: కేబీఆర్ పార్క్ చూట్టూ కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి: రేవంత్

ABN, First Publish Date - 2023-04-12T18:35:55+05:30

కేబీఆర్ పార్క్ (KBR Park) చూట్టూ కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: కేబీఆర్ పార్క్ (KBR Park) చూట్టూ కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు. అలాగే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో నిర్మాణాలకు నిబంధనలు ఉన్నాయని గుర్తుచేశారు. అందుకే దాని చుట్టూ కమర్షియల్ నిర్మాణాలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు ఉన్నవి కూడా బీఆర్‌ఎస్ (BRS) హయాంలో నిర్మించినవి మాత్రమేనని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాంతంలో దామోదర్రావు, కుర్ర శ్రీనివాసరావు పేరుతో అక్రమ నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. అక్రమ నిర్మాణానికి బీఆర్‌ఎస్ హయాంలో అనుమతులిచ్చారని విమర్శించారు. గ్రీన్జోన్లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారని, ఐదు అంతస్థులకు అనుమతులు ఉన్న చోట.. 21 అంతస్థులకు అనుమతులు ఇచ్చారని విమర్శించారు. 3 వేల గజాల స్థలంలో అపార్టుమెంట్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. నవాబ్ల పాత బంగ్లాను కూల్చడానికి ఎందుకు అనుమతులు ఇచ్చారని రేవంత్ ప్రశ్నించారు. క్యాన్సర్ ఆస్పత్రిని సైతం 3 అంతస్థులకు మించి నిర్మించ లేదని, అక్రమ నిర్మాణాలు పక్షుల జాతికి ప్రమాదకరంగా మారనున్నాయని తెలిపారు.

‘‘వాస్తవాలు చెబితే కేటీఆర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మంత్రి కేటీఆర్ (KTR), అతని తండ్రి కలిసి ఇంత విధ్వంసం చేస్తారా?.. నమ్మి రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడితే ఇంత విధ్వంసం చేస్తారా?.. నగరంలో ట్రాఫిక్జామ్ (Trafficjam)లు ఎందుకు అవుతున్నాయి?.. చిన్నపాటి వర్షానికే వరదలు ఎందుకు వస్తున్నాయి?.. ఈ అపార్ట్మెంట్ల వల్లే ట్రాఫిక్జామ్లు అవుతున్నాయి. నిజాం వారసత్వ భవనాన్ని కొనుగోలు చేసి కొత్త భవనం కడుతున్నారు. 20 శాతం భూములు రాసిఇచ్చిన వారికే అనుమతులు ఇస్తున్నారు. నమస్తే తెలంగాణ పేరు మీదే వేల గజాల భూములు నమోదయ్యాయి. ఏడుగురు ఐఏఎస్ అధికారులు, ఇద్దరు తండ్రీ కొడుకులతో డీ-9 గ్యాగ్ ఏర్పడింది. డీ-9 గ్యాంగ్ అరాచకాలతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు’’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Updated Date - 2023-04-12T18:35:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising