Doctor Preethi Death : ప్రీతి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కేసీఆర్ సర్కార్.. తీవ్ర ఉద్రిక్తత..
ABN, First Publish Date - 2023-02-26T22:53:50+05:30
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి (Doctor Preethi) కన్నుమూసింది. ఐదురోజులుగా నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటూ ఆదివారం రాత్రి 9.10 గంటలకు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి (Doctor Preethi) కన్నుమూసింది. ఐదురోజులుగా నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటూ ఆదివారం రాత్రి 9.10 గంటలకు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ప్రీతిని కాపాడేందుకు ప్రత్యేక వైద్య బృందం అన్నివిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. బాధిత ప్రీతి కుటుంబానికి 10 లక్షల రూపాయిలు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. అంతేకాదు.. ప్రభుత్వ పరంగా ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కేసీఆర్ సర్కార్ భరోసా ఇచ్చింది. విచారణలో తేలిన దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) ఈప్రకటన విడుదల చేశారు.
ప్రకటనలో ఏముందంటే..!
‘ప్రీతి ఘటన అత్యంత దురదృష్టం, బాధాకరం. ఎవరూ పూడ్చలేని దుఖంలో ఆ కుటుంబం ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. సీఎం కేసీఆర్ (CM KCR) ఆవేదన, విచారం వ్యక్తం చేశారు. అలాగే ప్రీతి ఘటనపై విచారణ కొనసాగుతున్నది. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో తేలిన దోషులు ఎంతటి వారైనా... సరే చట్ట ప్రకారంగా కఠినంగా శిక్షిస్తాం. ప్రీతి ఆత్మ శాంతించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాము. ప్రీతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని మంత్రి ఎర్రబెల్లి ప్రకటనలో ఉంది.
హరీష్ రావు ఇలా..
మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి (Doctor Preethi) తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) అన్నారు. ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం నిర్విరామంగా, శక్తి వంచన లేకుండా శ్రమించిందని మంత్రి చెప్పారు. పూర్తి అరోగ్య వంతురాలై వస్తుందని అనుకున్న డాక్టర్ ప్రీతి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం తన మనసును తీవ్రంగా కలిచి వేసిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని, బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. ఇటు నిమ్స్‌లో అటు వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేఎంసీ దగ్గర సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రజా సంఘాల యత్నించాయి. కేసీఆర్ సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిమ్స్‌లో పోలీసులకు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య తోపులాట జరుగుతోంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ప్రీతి మృత దేహాన్ని తీసుకొని ప్రగతి భవన్ వెళ్లడానికి కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు.
నిమ్స్‌లో లాఠీచార్జ్
నిమ్స్ ఆస్పత్రిలో తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కుటుంబానికి న్యాయం చేసేంతవరకు మృతదేహం తరలించేది లేదని విద్యార్థి , ప్రజా సంఘాలు ధర్నా చేపట్టాయి.ఎక్కడికక్కడ విద్యార్థి, ప్రజా సంగాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.విద్యార్థి, ప్రజా సంఘాల ఓవర్ యాక్షన్ & ధర్నా వల్ల అన్యాయం జరుగుతుందని ప్రీతి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే కొందరు మద్యం సేవించి నిమ్స్ ఆస్పత్రిలోకి ప్రవేశించారు. విద్యార్థి, ప్రజా రాజకీయ పార్టీల నేతలు సంయమనం పాటించాలని ప్రీతి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. నిమ్స్ హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రీతి మతదేహాన్ని తరలించే అంబులెన్స్‌కి విద్యార్థులు అడ్డంగా పడుకుని నిరసన చేపట్టారు.
ప్రీతి మృతి తీవ్రంగా కలిచి వేసింది: మంత్రి సత్యవతి రాథోడ్
మృత్యువుతో పోరాడుతూ ప్రీతి తుది శ్వాస విడవడం దురదృష్టకరం. పూర్తి అరోగ్య వంతురాలై వస్తుందని అనుకున్న డాక్టర్ ప్రీతి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం నా మనసును తీవ్రంగా కలిచి వేసిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ‘ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిన్ని ప్రార్థించారు. ప్రీతి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని... బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
******************************
ఇవి కూడా చదవండి..
******************************
Warangal Preethi Case: గాంధీ ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు.. ఏం జరుగుతోందో తెలియక ఆందోళనలో ప్రీతి కుటుంబ సభ్యులు..!
******************************
Warangal KMC: సీనియర్ల వేధింపులు.. విషపు ఇంజక్షన్ తీసుకున్న కేఎంసీ మెడికో
******************************
Doctor Preethi died: మృత్యువుతో పోరాడి ఓడిన ప్రీతి.. కన్నీరుమున్నీరవుతున్న ఫ్యామిలీ, ఫ్రెండ్స్
Updated Date - 2023-02-26T23:20:21+05:30 IST