KCR: అమరజ్యోతిని ప్రారంభించిన సీఎం కేసీఆర్
ABN, First Publish Date - 2023-06-22T19:07:18+05:30
అమరజ్యోతిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (KCR) ఆవిష్కరించారు.
హైదరాబాద్: అమరజ్యోతిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (KCR) ఆవిష్కరించారు. అమరులకు నివాళిగా సీఎం కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ముగిశాయి. రూ.178 కోట్లతో అమరవీరుల స్థూపాన్ని నిర్మించారు. మొత్తం 6 ఫ్లోర్లతో నిర్మాణం చేపట్టారు. స్టెయిన్ లెస్ స్టీల్‌తో అమరవీరుల స్థూపాన్ని నిర్మించారు.
అమరవీరుల స్మారకాన్ని కేసీఆర్ ప్రారంభించారు. రూ.178 కోట్ల వ్యయంతో 150 అడుగుల ఎత్తుతో అమరుల స్మారకాన్ని నిర్మించారు. స్టెయిన్ లెస్ స్టీల్‌తో ప్రమిద, దీపం ఆకృతిలో అమరుల స్మారకం ఏర్పాటు చేశారు. మూడున్నర ఎకరాలకుపైగా విస్తీర్ణంలో స్మారక నిర్మాణం చేపట్టారు.
అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్ర చాలా పెద్దదని చెప్పారు. ఖమ్మం జిల్లా ఇల్లందులో తెలంగాణ ఉద్యమం మొదలైందని, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పేర్లు తలచుకోవాలని, తెలంగాణ ఎన్నో బాధలు అనుభవించిందని సీఎం కేసీఆర్ అన్నారు. నాటి నుంచి నేటి వరకు విద్యార్థులు ఎంతో గొప్పగా పనిచేశారని, ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణ వాది అని కేసీఆర్ తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శకత్వంలో నడిచామని, తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలని కేసీఆర్ స్పష్టం చేశారు.
Updated Date - 2023-06-22T20:20:07+05:30 IST