చేసిన అవినీతికి కేసీఆర్ నరకానికి వెళతారు!
ABN, First Publish Date - 2023-02-23T09:00:58+05:30
తెలంగాణ సీఎం కేసీఆర్ దొర కాదు దొంగ అని కోర్టులో రుజువు చేస్తానని ప్రజాశాంతి పార్టీ
నేను ప్రార్థన చేస్తే ఆయన నాశనం అవుతారు: కేఏ పాల్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఎం కేసీఆర్ దొర కాదు దొంగ అని కోర్టులో రుజువు చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధ్వజమెత్తారు. ఆయన తనను ఎదుర్కోలేక.. తన సోదరుడి హత్య కేసును తిరగతోడుతున్నారని మండిపడ్డారు. హైకోర్టు, సుప్రీం కోర్టును కేసీఆర్ కొనలేరన్నారు. బుధవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచంలోని మహామహా నేతలనే తన ముందు మోకరిల్లేలా చేశానని, కేసీఆర్ ఎంత అంటూ హెచ్చరించారు. కేసీఆర్ తనను చంపేస్తే స్వర్గానికి వెళ్తానని, కానీ.. చేసిన అవినీతికి కేసీఆర్ నరకానికి వెళ్తారన్నారు. తాను ప్రార్థన చేస్తే కేసీఆర్ నాశనం అవుతారని.. ఇప్పటి వరకు అలా చేయలేదని చెప్పారు. దేవుడి దూత మీద చెయ్యి వేస్తే దేవుడు క్షమించడని, చివరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తన తమ్ముడు కూడా మిగలలేదన్నారు.
Updated Date - 2023-02-23T09:26:01+05:30 IST