KCR: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఆ ఒక్కటీ తప్ప అన్నీ...!
ABN, First Publish Date - 2023-03-09T20:52:19+05:30
సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) ముగిసింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) ముగిసింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఈడీ విచారణకు హాజరుకావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు నోటీసులు అందిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధానంగా ఈడీ విచారణపై కేబినెట్‌లో చర్చ జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ విచారణపై ఎలాంటి సమాచారం రాలేదు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపైనే మంత్రులు చర్చించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కట్టించి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ఇలా ఉండగానే ఈ రోజు జరిగిన కేబినెట్‌లో గృహలక్ష్మి పథకం కింద 4 లక్షల మందికి ఇళ్ల మంజూరుకు గ్రీన్ సిగ్నలివ్వడం గమనార్హం. ఇటీవల ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసగించారు. గవర్నర్ అసెంబ్లీకి రావడంతో రాజ్‌భవన్, ప్రగతిభవన్ (Raj Bhavan Pragati Bhavan) మధ్య గ్యాప్ దూరం తగ్గిందని అందరూ అనుకున్నారు. కానీ ఇవాళ జరిగిన కేబినెట్‌లో సమావేశంలో గవర్నర్‌పై సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు చేయాలని కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
కీలక నిర్ణయాలు ఇవే
తెలంగాణలో మరో 1.30 లక్షల కుటుంబాలకు దళితబంధు
గృహలక్ష్మి పథకం కింద 4 లక్షల మందికి ఇళ్ల మంజూరు
నియోజకవర్గానికి 3 వేల చొప్పున ఇళ్ల కేటాయింపునకు నిర్ణయం
లబ్ధిదారుడికి రూ.3 లక్షలు గ్రాంట్‌గా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం
సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఆర్థికసాయం
వెంటనే లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని టీఎస్ కేబినెట్ నిర్ణయం
గృహనిర్మాణ సంస్థ ద్వారా కట్టుకున్న ఇళ్లపై రుణాలు మాఫీ
1,55,393 మందికి పోడు పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయం
ఏప్రిల్‌లో రెండో విడత గొర్రెల పంపిణీకి టీఎస్ కేబినెట్ నిర్ణయం
గవర్నర్ దగ్గర పెండింగ్ బిల్లుల పరిష్కారం కోసం..
సుప్రీంకోర్టుకు వెళ్లాలనే నిర్ణయాన్ని ఆమోదించిన కేబినెట్
Updated Date - 2023-03-09T20:52:19+05:30 IST