Bhadrachalam: మహాలక్ష్మీ అలంకారంలో అమ్మవారు
ABN, First Publish Date - 2023-10-23T08:03:40+05:30
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో వేంచేసి యున్న శ్రీ లక్ష్మి తాయారు అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో వేంచేసి యున్న శ్రీ లక్ష్మి తాయారు అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. సోమవారం శ్రీ లక్ష్మి తాయారు అమ్మవారు మహాలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజామునుంచే బారులు తీరారు.
కాగా దేవీ శరన్ననవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి దేవస్థానంలోని లక్ష్మీతాయారు అమ్మవారు ఆదివారం వీరలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం విజయదశమి వేడుకలు జరగనున్నాయి. ఇందుకోసం దసరా మండపంలో శ్రీరామలీలా మహోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే శ్రీరామ పట్టాభిషేకం, శ్రీరామలీలా మహోత్సవాలను కూడా నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు.
Updated Date - 2023-10-23T08:03:40+05:30 IST