ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Heavy Rains: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు..

ABN, First Publish Date - 2023-12-06T08:17:06+05:30

భద్రాద్రి కొత్తగూడెం: మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అశ్వారావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా అతి భారీ వర్షం కురుస్తోంది. ఏకాదటిగా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వేరు శెనగ, వరి, పత్తి, మిర్చి పంటలకు భారీ నష్టం వాటిల్లింది.

భద్రాద్రి కొత్తగూడెం: మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అశ్వారావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా అతి భారీ వర్షం కురుస్తోంది. ఏకాదటిగా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వేరు శెనగ, వరి, పత్తి, మిర్చి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. దమ్మపేటలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ప్రధాన రహదారిపై భారీ ఎత్తున వరద నీరు చేరింది. నెమలిపేట వద్ద వాగు పొంగటంతో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. గాయత్రి నగర్, పలు కాలనీలు వరద నీటితో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పినపాక నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అక్కడక్కడ పంట పొలాలు నీట మునిగాయి. మణుగూరు ఏరియా సింగరేణి ఉపరితల గనుల్లోకి వరదనీరు చేరింది. దీంతో సుమారు 40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మట్టి వెలికితీత (OB) పనులను పూర్తిగా అధికారులు నిలిపివేశారు. ఓసీలో ఎక్కడిక్కక్కడే భారీ యంత్రాలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల భారీ, కొన్నిప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడుతున్నాయి. ములుగు, మహబూబాబాద్‌లో ఎడతెరిపి లేని వాన కురుస్తోంది. దీంతో మహబూబాబాద్‌లో కలెక్టర్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వర్షాలకు వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-12-06T08:17:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising