Kishan Reddy: బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామిక చర్య.. పరీక్షల పేపర్ లీక్‌లపై పోరాటం కొనసాగిస్తాం
ABN, First Publish Date - 2023-04-05T21:40:13+05:30
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అరెస్ట్ అప్రజాస్వామిక చర్య, బండి సంజయ్ (Bandi Sanjay) అరెస్ట్ సందర్భంలో పోలీసుల తీరు దారుణమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అరెస్ట్ అప్రజాస్వామిక చర్య, బండి సంజయ్ (Bandi Sanjay) అరెస్ట్ సందర్భంలో పోలీసుల తీరు దారుణమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఉగ్రవాదులతో కంటే హీనంగా పోలీసులు వ్యవహరించారని, సంజయ్‌ను అనేక ప్రాంతాల్లోకి, అనేక పీఎస్‌లకు తిప్పారని, ప్రగతిభవన్ స్క్రిప్ట్ ప్రకారం పోలీసులు ప్రకటనలు చేశారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. TSPSC సహా అన్ని పరీక్షల పేపర్ లీక్‌లపై పోరాటం కొనసాగిస్తామని కిషన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేతకానితనంతో లక్షలాది మంది విద్యార్థులు రోడ్డునపడ్డారని, దీనిపై పోరాటం చేయడం బీఆర్‌ఎస్ దృష్టిలో నేరమని, సంజయ్ అరెస్ట్‌పై న్యాయ, రాజకీయ పోరాటాలు చేస్తామన్నారు. కల్వకుంట కుటుంబ, అవినీతి పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.
కేసులు పెట్టారని, తమ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేశారని భయపడమని, రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా వ్యవహరిస్తున్నారని, కేసీఆర్‌ది నియంతృత్వ పాలనన్నారు. తెలంగాణలో ఏం సాధించాలన్నా కోర్టుకు వెళ్లే పరిస్థితి, అక్రమ అరెస్ట్‌లు, నియంతృత్వ చర్యలు బీజేపీ గొంతు నొక్కలేవని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో కేసీఆర్ ప్రభుత్వంపై ఆందోళనలు జరుగుతున్నాయని, విద్యార్థుల ఆందోళనతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. డైవర్షన్ రాజకీయాలు కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య, కేసీఆర్ బీఆర్‌ఎస్ ఎందుకు పెట్టారో ఎవరికీ అర్థం కావడం లేదని, బండి సంజయ్‌ను ప్రభుత్వం టార్గెట్ చేసిందని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి, కొడుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, తెలంగాణలో దోచుకున్నది చాలదన్నట్లు.. దేశం మొత్తం దోచుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. దొంగ కేసులు, ఎమ్మెల్యేల నిర్బంధం కేసీఆర్‌కే చెల్లుద్దని, ప్రధాని వస్తున్నది ప్రభుత్వ కార్యక్రమం కోసమని కిషన్‌రెడ్డి అన్నారు.
Updated Date - 2023-04-05T21:42:43+05:30 IST