ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

3 నెలల ముందు డిసైడ్ అయిన మీటింగ్.. అధికారులంతా ఫ్లై ఓవర్ ఇనాగరేషన్‌కి జంప్.. కిషన్‌రెడ్డి ఫైర్

ABN, First Publish Date - 2023-08-19T13:00:54+05:30

జీహెచ్ఎంసీ తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల ముందు నిర్ణయించిన దిశా మీటింగ్‌కు అధికారులు హాజరు కాకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశం ఉన్నా ఫ్లైఓవర్ ఇనాగరేషన్ ఎలా పెట్టుకుంటారని అధికారులను కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల ముందు నిర్ణయించిన దిశా మీటింగ్‌కు అధికారులు హాజరు కాకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశం ఉన్నా ఫ్లైఓవర్ ఇనాగరేషన్ ఎలా పెట్టుకుంటారని అధికారులను కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్వోబీ నిర్మాణానికి రైల్వే శాఖ ఒప్పుకున్నా జీహెచ్ఎంసీ సహకరించడం లేదని కిషన్ రెడ్డి దృష్టికి రైల్వే అధికారులు తెచ్చారు. రెండు రోజుల ముందు ఫ్లైఓవర్ ఇనాగరేషన్ కార్యక్రమం పెట్టుకుని దిశా సమావేశానికి డుమ్మా కొడతారా? ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ సహకారం లేని కారణంగా పనులు పెండింగ్‌లో పడుతున్నాయి. వారి నుంచి సరైన సహకారం ఉండటం లేదని కిషన్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. ఈ సమావేశంలో సమాధానం చెప్పేవారు కూడా లేరన్నారు. రైల్వే పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నా అందుకు తగిన సహకారం ఉండటం లేదన్నారు. హైదరాబాద్ కలెక్టర్ కు జీహెచ్ఎంసీ, రైల్వే సిబ్బందిని కోఆర్డినేట్ చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.

Updated Date - 2023-08-19T13:00:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising